Begin typing your search above and press return to search.
వైరస్ కంటే భయమే మనల్ని చంపేస్తుంది : మెగాస్టార్
By: Tupaki Desk | 14 May 2021 6:00 PM ISTదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే కరోనా ను అరికట్టడానికి తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ను అనౌన్స్ చేశాయి. అయితే , లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల కోసం కొంచెం సేపు లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇస్తుంటే , అవసరం ఉన్న వారు కంటే అనవసరంగా బయటకి వచ్చే వారు ఆ సమయంలో ఎక్కువగా ఉన్నారు. అందుకే కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. అటు ఏపీలో , ఇటు తెలంగాణ లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అయితే , కరోనా మహమ్మారి భారిన పడిన వారి సంగతి మరోలా ఉంది. కరోనా భారిన పడి చికిత్స తీసుకుంటూ కొందరు , ఆక్సిజన్ సరైన సమయంలో అందక చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందిస్తూ... కరోనా వల్ల మన ఆత్మీయులను కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని, గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారని , అందరూ ఇప్పటికైనా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని , అలాగే కుదిరితే డబుల్ మాస్కులు ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పని లేదని చిరంజీవి అన్నారు. వైరస్ కంటే భయమే మనల్ని ఎక్కువగా చంపేస్తుందని చెప్పారు. ఒంట్లో నలతగా అనిపించినా, ఊపిరి ఇబ్బంది అనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయని వారు ప్లాస్మా డొనేట్ చేస్తే కనీసం ఇద్దరి ప్రాణాలు కాపాడినవారు అవుతారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.