Begin typing your search above and press return to search.

పాక్ కు రహస్యంగా వెళ్లిపోయిన నటుడు!

By:  Tupaki Desk   |   27 Sept 2016 3:35 PM IST
పాక్ కు రహస్యంగా వెళ్లిపోయిన నటుడు!
X
ఇండియాలో ఉన్న, బాలీవుడ్ లో నటిస్తున్న పాకిస్థాన్ కళాకారులంతా రెండు రోజుల్లో భారత్ విడిచిపెట్టి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్పందించిన మహారాష్ట్ర పోలీసులు - ఏమాత్రం భయపడొద్దని - భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయినా కూడా వారి ఆందోళన వారికుంటుందిగా? ఇదే కారణమో లేక మరేదైనానో కానీ... చెప్పాపెట్టకుండా రహస్యంగా పాకిస్థాన్ వెళ్లిపోయాడు ఒక పాక్ నటుడు.

తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం... పాక్ నటుడు ఫవాద్ ఖాన్ రహస్యంగా దేశం విడిచి స్వదేశానికి వెళ్లిపోయాడు. అంతేకాదు.. ఇప్పట్లో భారత్ కు తిరిగొచ్చే ఉద్దేశ్యం అతనికి లేదంట! ఇదే క్రమంలో మరికొంతమంది పాక్ కళాకారులు ఫవాద్ ఖాన్ ను అనుసరించొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, పాకిస్థాన్ కు చెందిన పలువురు నటీనటులు బాలీవుడ్ సినిమాలు - టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. వీళ్లలో ఫవాద్ అగ్రశ‍్రేణి నటుడు.. కరణ్ జొహార్ సినిమాలో నటించాడు. అయితే మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరికల అనంతరం సినిమా ప్రమోషన్ లో ఫవాద్ పాల్గొనడని కరణ్ జొహార్ చెప్పాడు. అయితే పాక్ నటులు పాల్గొంటున్న షూటింగ్ లను అడ్డుకుని తీరతామని - వాళ్లకు అవకాశాలు ఇవ్వరాదని ఎంఎన్ ఎస్ నాయకులు బాలీవుడ్ దర్శక నిర్మాతలను హెచ్చరించారు.

కాగా... ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్ - పాకిస్థాన్ సంబందాలు పూర్తిగా దెబ్బతినబోతున్నాయని ఇప్పటికే పలు సంకేతాలు వస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా పాక్ పై డైరెక్ట్ అటాక్ చేసేస్తుంది భారత్. ఈ సమయంలో ఎవరికి తోచిన స్థాయిలో వారు పాక్ పై ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. నటీనటులపై ఎంఎన్ ఎస్ అల్టిమేటం జారీ చేయగా... పాక్ ఉత్పత్తులేమీ భారత్ లో అమ్మవద్దని, ఆ దిశగా షాపింగ్ మాల్స్, దుకాణాలు ఆలోచించాలని ముంబై యూత్ అసోషియేషన్ డిమాండ్ చేసింది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/