Begin typing your search above and press return to search.

పాక్ యాక్టర్.. అప్పుడలా ఇప్పుడిలా!!

By:  Tupaki Desk   |   9 April 2016 9:30 AM GMT
పాక్ యాక్టర్.. అప్పుడలా ఇప్పుడిలా!!
X
పాకిస్తాన్ ఫిలిం యాక్టర్ ఫవాద్ ఖాన్ కీలక పాత్రలో నటించిన కపూర్ అండ్ సన్స్ బాలీవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంద. సిద్ధార్ధ్ మల్హోత్రా - అలియా భట్ రిషి కపూర్ లు నటించిన ఈ చిత్రం ఇప్పటివరకూ ఈ మూవీకి 71 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ పాక్ యాక్టర్ రోల్ పై ఇప్పుడు విపరీతమైన కౌంటర్స్ వస్తున్నాయి.

ఫవాద్ ఖాన్ గతంలో తెగ పోజు కొట్టేవాడు. తన సినిమాలో హీరోయిన్లకు ముద్దులు పెట్టనని, ఇంటిమేట్ సీన్లు ఉండవని, అసలు తన పక్కన చేసే హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా వీల్లేదని.. ఇలా బోలెడన్ని రూల్స్ పెట్టేవాడు ఖాన్. ఇవన్నీ ఎందుకయ్యా బాబూ అంటే.. తమ దేశంలో ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని.. అందుకే ఇలాంటి సహించబోనని తేల్చేశాడు.

తీరా ఇప్పుడు కపూర్ అండ్ సన్స్ లో ఫవాద్ ఖాన్ చేసినది 'గే'పాత్ర. మరి ఎక్స్ పోజింగ్ కనిపిస్తేనే పాక్ ప్రజల మనోభావాలు దెబ్బతింటే.. ఓ పాకిస్తానీ యాక్టర్ గే కేరక్టర్ లో కనిపిస్తే.. ఏం అనుకోరా అన్నది ఇప్పుడు ప్రశ్న. గే పాత్ర అంటే.. ముద్దు సీన్ల కంటే ఘోరమైనవా ఫవాద్ అంటూ నిలదీస్తున్నారు జనాలు.