Begin typing your search above and press return to search.

హీరోయిన్లకి అడ్డుపడుతున్న పేరెంట్స్...!

By:  Tupaki Desk   |   22 July 2020 7:00 AM IST
హీరోయిన్లకి అడ్డుపడుతున్న పేరెంట్స్...!
X
కరోనా మహమ్మారి గత నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అయింది. దీంతో సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇక షూటింగ్స్ లేకపోవడంతో నటీనటులు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. నిజానికి క‌రోనా కార‌ణంగా మెయిన్ స్ట్రీమ్ షూటింగ్స్ ఆగిపోయిన‌ప్ప‌టికీ బ్రాండ్ మరియు ఎండార్స్ మెంట్స్ షూట్స్ మాత్రం ఆగ‌లేదు. కాకపోతే షూటింగ్ లొకేషన్స్ మాత్రం చేంజ్ చేసారు. సాధార‌ణంగా ఇలాంటి యాడ్స్ షూట్స్ అన్నీ ఎక్కువగా ముంబైలో జరుగుతుంటాయి. అయితే ముంబైలో క‌రోనా ఆంక్ష‌లు కార‌ణంగా షూట్స్ అన్నీ హైద‌రాబాద్ కు షిఫ్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ లో ఉన్న ప్రముఖ స్టూడియోలన్నీ ఇప్పుడు యాడ్ షూట్స్ సిబ్బంది హ‌డావుడితో నిండిపోతున్నాయని సమాచారం.

కాగా ఈ యాడ్ షూట్స్ లో పాల్గొనడానికి హీరోయిన్స్ కి ఇంట్లో పర్మిషన్స్ దొరకడం లేదట. ముఖ్యంగా ఈ షూట్స్ లో కొంతమంది స్టార్ హీరోయిన్స్ పాల్గొన‌వాల్సి ఉండగా పేరెంట్స్ మాత్రం షూటింగ్స్ కి పంపించడానికి ససేమిరా అంటుంటున్నారట. హీరోయిన్ అవుతానంటే హ్యాపీగా ఇండ‌స్ట్రీలోకి పంపిన చాలామంది స్టార్ హీరోయిన్ల ఫాద‌ర్లు ఇప్పుడు షూటింగ్స్ కి అడ్డుప‌డుతున్నార‌ని క్యాస్టింగ్ వర్గాలు గ‌గ్గోలు పెడుతున్నారట. అయితే వీరి ప‌ర్స‌న‌ల్ మేన‌జ‌ర్లు షూట్ లొకేష‌న్ కి వెళ్లి అక్క‌డ సిబ్బంది క‌రోనా జాగ్రత్తలు కార్య‌క్ర‌మాలు చేస్తున్నారో లేదో అని తెలుసుకుంటున్నారట. అంతేకాకుండా షూట్ లొకేషన్ ని వీడియో తీసి పంపితేనే హీరోయిన్ల‌కి వారి ఇళ్ల‌లో బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి ప‌ర్మిష‌న్స్ వ‌స్తున్నాయట‌. ఏదేమైనా కానీ క‌రోనా మహమ్మారి అందరి సరదా తీర్చేస్తోందని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.