Begin typing your search above and press return to search.

లిక్‌ క్లిక్‌ : మెగాస్టార్‌ సూపర్‌ స్టార్‌ ఫాదర్స్‌ డే స్పెషల్‌

By:  Tupaki Desk   |   21 Jun 2020 12:20 PM IST
లిక్‌ క్లిక్‌ : మెగాస్టార్‌ సూపర్‌ స్టార్‌ ఫాదర్స్‌ డే స్పెషల్‌
X
మెగాస్టార్‌ అయినా సూపర్‌ స్టార్‌ అయినా ఒక తండ్రికి కొడుకే. నేడు ఫాదర్స్‌ డే సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి ఇంకా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబులు తన తండ్రి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. సోషల్‌ మీడియాలో తండ్రి ఫొటోలను షేర్‌ చేశారు. చిరంజీవి తన తండ్రి వెంకట్రావు చరణ్‌ ను ఎత్తుకుని ఉన్న ఫొటోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేశారు. దాంతో పాటు చిరుత విత్‌ మై ఛార్మింగ్‌ డాడ్‌. మా నాన్న నవ్వు.. నా బిడ్డ చిరునవ్వు రెండు నాకు ఇష్టం అంటూ ఈ ఫొటోను చిరంజీవి పోస్ట్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో ఈ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది.

ఇక మహేష్‌ బాబు తన చిన్నప్పటి ఫొటోను షేర్‌ చేశాడు. అందులో నాన్న కృష్ణతో మహేష్‌ బాబు ఉన్నాడు. మీరు నాకు మార్గదర్శకులు నా ఎవగ్రీన్‌ సూపర్‌ స్టార్‌ అంటూ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. మహేష్‌ బాబు ఈ ఫొటోలో చాలా క్యూట్‌ గా ఉన్నాడు. పదేళ్ల వయసులో మహేష్‌ బాబు కృష్ణతో తీసుకున్న ఈ ఫొటో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది. మొత్తానికి సూపర్‌ స్టార్‌ మెగాస్టార్‌ లు ఫాదర్స్‌ డే సందర్బంగా ట్వీట్‌ చేసిన పోస్ట్‌ లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.