Begin typing your search above and press return to search.

తండ్రి జీన్స్‌ నుంచే నటన పుడుతుంది!?

By:  Tupaki Desk   |   22 July 2015 3:40 PM GMT
తండ్రి జీన్స్‌ నుంచే నటన పుడుతుంది!?
X
అంబానీకి బిడ్డలు అయినా, సూపర్‌ స్టార్‌ కి కిడ్‌ అయినా జీన్స్‌ అనేవి పనిచేస్తాయి. స్వతహా ట్యాలెంటు ఉంటుంది. దానికి జీన్స్‌ అదనపు బలం అవుతాయి. రక్తంలో కొంత ఉండాలి. ఛరిష్మా, ఇంటెలిజెన్స్‌, లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ లాంటివి నటుడికి అవసరం అవుతాయి. అవన్నీ తండ్రి నుంచే సంక్రమించాలి. అక్కడ జీన్స్‌ పార్ట్‌ చాలా ఎక్కువ.

టాలీవుడ్‌ లో మహేష్‌, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి నటవారసుల్ని పరిశీలిస్తే తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఆణిముత్యాలుగా వెలిగిపోతున్నారు. మహేష్‌ చిన్నప్పట్నుంచి సూపర్‌ స్టార్‌ కృష్ణ సినిమాలు చూస్తూ పెరిగానని, వాటి ప్రభావం తనపై ఎంతో ఉందని చెప్పాడు. అలాగే నాగార్జనకు అక్కినేని ఇన్‌ స్పిరేషన్‌. బాలయ్యకు తారకరాముడు ఇన్‌ స్పిరేషన్‌. ఇలా చూస్తే వారసులంతా వారి తండ్రుల జీన్స్‌ లోంచి, నిత్యవ్యాపకం నుంచి ఇన్‌ స్పయిర్‌ అయ్యారనే చెప్పాలి. అలాగే రామానాయుడు ఉన్నట్టుండి ఓ రోజు వెంకీని పిలిచి నువ్వు హీరో అవ్వు అన్నారు. అప్పటివరకూ డాక్టర్‌, ఇంజినీర్‌ ఏదో ఒకటి అయితే చాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ముఖానికి రంగేసుకుని హీరో అయ్యారు వెంకీ. ఎలాగూ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలోంచే వచ్చాడు కాబట్టి హీరోగా రాణించడానికి పెద్దగా కష్టించలేదు.

అయితే ఎంత నటవారసత్వం ఉన్నా, ఆ తర్వాత కెరీర్‌ ని పెద్దగా మలుచుకోవడం మాత్రం కేవలం తమ సొంత ట్యాలెంటుపైనే ఆధారపడి ఉంటుంది. శ్రుతిహాసన్‌ కమల్‌ హాసన్‌ -సారికల నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇప్పుడు పెద్ద స్టార్‌ అయిపోయింది. ఆలియాభట్‌ దర్శకురాలు మహేష్‌ భట్‌కి తనయురాలు. కానీ నటిగా తనంతట తానుగా తనని మలుచుకుంటోంది. గొప్ప నటిగా ఎదుగుతోంది. అంబానీ కొడుకు అంబానీ అంత అయ్యాడంటే తండ్రి జీన్స్‌ వల్లే. అలాగే నట వారసత్వం కూడా జీన్స్‌ నుంచి కొంత ప్లస్‌ అవుతుంది. అదీ సంగతి.