Begin typing your search above and press return to search.

జగపతిబాబు ప్రధాన పాత్రలో 'ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్'

By:  Tupaki Desk   |   24 Dec 2020 12:34 PM IST
జగపతిబాబు ప్రధాన పాత్రలో ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్
X
అలా మొదలైంది' 'అంతకుముందు...ఆ తరువాత' 'కళ్యాణ వైభోగమే' వంటి విజయవంతమైన చిత్రాలతో అభిరుచిగల నిర్మాత అనిపించుకున్న కె.ఎల్. దామోదర్ ప్రసాద్.. ఇప్పుడు శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై ''ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్'' అనే చిత్రాన్ని నిర్మించాడు. ప్రముఖ కథానాయకుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తీక్ - అమ్ము అభిరామి(తమిళ చిత్రం 'అసురన్' ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాల నటి సహశ్రిత మరో కీలక పాత్రలో కనిపించనుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 'ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్' చిత్రాన్ని 2021 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా శివ.జి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అలీ - దగ్గుబాటి రాజా - కళ్యాణి నటరాజన్ - బ్రహ్మాజీ - కృష్ణ భగవాన్ - రజిత - జబర్దస్త్ రామ్ ప్రసాద్ - నవీన్ - వెంకీ - రాఘవ - భరత్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.14 గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను మేకర్స్ తెలియజేసారు.

ఈ సందర్భంగా శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ అధినేత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ...'మేము నిర్మించిన చిత్రాల విజయాల వెనుక వైవిధ్యమైన కథాబలంతో పాటు చిత్ర తారాగణం, సాకేంతిక నిపుణుల ప్రతిభ ఎంతో ఉంది. వీటితో పాటు ఆ చిత్రాల పబ్లిసిటీ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారం ఎప్పటికీ మరిచిపోలేనిది. కొంత విరామం తరువాత మళ్ళీ వరుసగా చిత్రాలను నిర్మించబోతున్నాను. ఇప్పటికే నాలుగు కథలను సిద్ధం చేయటం జరిగింది. వీటిలో ఒక చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటిస్తున్నాను. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేస్తాం. కోవిడ్ సమయంలో థియేటర్ లు తెరుచుకోని పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఈ రంగం కోలుకునే దిశగా ప్రయాణం మొదలవుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 2021 లో థియేటర్స్ లోనే విడుదల చేసే దిశగా ప్లాన్ చేస్తున్నాం'' అని తెలిపారు. ఇక దర్శకుడు విద్యాసాగర్ రాజు మాట్లాడుతూ.. ''రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రానికి రూపకల్పన చేయటం జరిగింది. ఈ చిత్రం పేరును బట్టి ఇది మరింతగా ప్రస్ఫుటమవుతుంది. 'ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్' అనే పాత్రల మధ్య జరిగే భావోద్వేగాలు, వినోదం సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి'' అని చెప్పుకొచ్చాడు.