Begin typing your search above and press return to search.

తండ్రి హీరోగా.. కూతుర్లు హీరోయిన్లుగా..!

By:  Tupaki Desk   |   11 May 2021 8:00 AM IST
తండ్రి హీరోగా.. కూతుర్లు హీరోయిన్లుగా..!
X
'కల్కి' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సీనియర్ హీరో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. లలిత్ అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ 'శేఖర్' అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో త‌న 92వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు. ‘గ‌తం’ ఫేమ్ కిర‌ణ్ కొండ‌మ‌డుగ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విభిన్నమైన కాన్సెప్ట్ తో 'RS92' చిత్రం తెర‌కెక్క‌నుంది. వీటితో పాటు 'మర్మాణువు' అనే సినిమాలో రాజశేఖర్ నటించనున్నారు. 'కేరాఫ్ కంచరపాలెం' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇలా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ ఫామ్ లోకి రావ‌డానికి ట్రై చేస్తున్నాడు. ఈలోపున అమ్మాయిలిద్ద‌రిని హీరోయిన్లుగా సెటిల్ చేయ‌డానికి జీవిత రాజశేఖర్ ట్రై చేస్తోంది. రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తెలిద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 'దొరసాని' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చిన్న కుమార్తె శివాత్మిక ప్రస్తుతం 'పంచతంత్రం' అనే మూవీ చేస్తోంది. పెద్ద కుమార్తె శివాని 'www' 'వెన్నెల' వంటి సినిమాలతో పాటుగా 'అంబరివు' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇలా ఇద్దరూ హీరోయిన్లుగా బిజీగా ఉన్నారు. కాకపోతే ఇవన్నీ చిన్న సినిమాలే. ప్రస్తుతానికైతే పెద్ద బ్యాన‌ర్లలో వీరికి స‌రైన అవ‌కాశాలు దొర‌క‌డం లేద‌ట. మరి రాబోయే రోజుల్లో పెద్ద సినిమా ఆఫర్స్ తలుపు తడతాయేమో చూడాలి.