Begin typing your search above and press return to search.
‘‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’’.. ఆ చాప్టర్ తో క్లోజ్!
By: Tupaki Desk | 15 Jun 2021 7:00 AM ISTలవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ కు మాత్రమే కాదు.. యాక్షన్ చిత్రాలకూ భారీగా అభిమానులు ఉన్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రేక్షకుల్లో వీరి షేర్ చాలా ఎక్కువేం. అందుకే.. వీరికోసం ఎన్నో యాక్షన్ సినిమాలు రూపొందుతుంటాయి. కంటెంట్ ఉండాలేగానీ.. అద్భుతమైన విజయాలు కూడా నమోదు చేస్తుంటాయి. అలాంటి సక్సెఫుల్ యాక్షన్ మూవీస్ లో ఒకటి 'ఫాస్ట్ అండ్ ప్యూరియస్'.
ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన 8 సిరీస్ లు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 9వ చిత్రం రాబోతోంది. 'F9' టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం కోసం వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. 'F9' సునామీ సమ్మర్ లో థియేటర్లను తాకాల్సి ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో ఆగిపోయింది. జస్టిన్ లిన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ అభిమానులను విశేషంగా అలరించింది. ఈ నేపథ్యంలో సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు షాకిచ్చే న్యూస్ చెప్పారు హీరో విన్ డీజిల్.
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్ కు ముగింపు పలికే సమయం వచ్చేసిందని చెప్పాడు. ప్రస్తుతం 9వ సిరీస్ రిలీజ్ కానుండగా.. మరో రెండు సిరీస్ లు వదిలిన తర్వాత క్లోజ్ చేస్తామని వెల్లడించాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూల్లో ఈ మేరకు అనౌన్స్ చేశాడు డీజిల్. 2023 లోపు 10, 11 సిరీస్ లను రిలీజ్ చేసి ఈ సిరీస్ చాప్టర్ క్లోజ్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
''ఈ సిరీస్ ను ఇష్టపడే వారికి ఇది జీర్ణించుకోలేని విషయమే. కానీ.. ఏ కథకైనా ఎక్కడో ఒక చోట ముగింపు పలకాల్సి ఉంటుంది.'' అని అన్నాడు విన్ డీజిల్. 2003లో మొదలైన ఈ సిరీస్.. పద్దెనిమిదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. మరో రెండు సిరీసులు తీసి.. రెండు దశాబ్దాల తర్వాత ఘనంగా ముగింపు పలకాలని భావిస్తున్నారు మేకర్స్.