Begin typing your search above and press return to search.

ప్రీ లుక్‌: కొలతలు తీస్తున్న డిజైనర్

By:  Tupaki Desk   |   31 March 2017 5:45 PM GMT
ప్రీ లుక్‌: కొలతలు తీస్తున్న డిజైనర్
X
చాలాకాలం నుండి హిట్లు లేక సతమతమవుతున్నాడు సీనియర్ దర్శకుడు వంశీ. ఇప్పుడు తన సూపర్ హిట్ సినిమా 'లేడీస్ టైలర్'కు సీక్వెల్ ను దించుతున్నాడు. 'ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్' అంటూ వస్తున్న ఈ సినిమా తాలూకు ప్రీ-లుక్ ఎట్టకేలకు బయటకు వచ్చింది.

ఒకమ్మాయి చెస్ట్ దగ్గర కొలతలు తీసుకుంటున్న హీరో. అంతకంటే ఏం కావాలి.. సంచలనాలు క్రియేట్ చేయడానికి. అదేనండీ.. ఉన్నపళంగా జనాలు తన సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో వంశీ అదే చేశాడు. ఆ ఐడియా కత్తిలా ఉంది. ఇంతకీ హీరో సుమంత్ అశ్విన్ కొలతలు తీస్తుంది ఏ హీరోయిన్ కు అంటారు? ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ మెయిన్ లీడ్ చేస్తుండగా.. మనాలి రాథోడ్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. తెలుగమ్మాయి మానస 3వ హీరోయిన్ గా కనిపిస్తుందట. ఈ సినిమాకు స్వరాలబ్రహ్మ మణిశర్మ చక్కనైనా బాణీలు అందించాడని తెలుస్తోంది. ఈ సినిమాను మధుర శ్రీధర్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ప్రీ లుక్ తో మాంచి బజ్ నే క్రియేట్ చేస్తున్న వంశీ.. ఫస్ట్ లుక్ తో అలాగే ట్రైలర్ తో ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా హిట్టయితే చాన్నాళ్ళ నుండి అందకుండా పోతున్న ఆ హిట్ వంశీ ఖాతాలో పడినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/