Begin typing your search above and press return to search.

ఇల్లీ బేబీని భుజానేసుకున్న డిజైనర్

By:  Tupaki Desk   |   23 Nov 2016 10:02 AM GMT
ఇల్లీ బేబీని భుజానేసుకున్న డిజైనర్
X
సినిమాల్లో హీరోలతో హీరోయిన్లు చాలా రకాల యాంగిల్స్ లో కనిపిస్తూ ఉంటారు. రొమాన్స్ పండించడం కోసం ఏదైనా చేసేస్తుంటారు. కానీ ఆఫ్ స్క్రీన్ లో ఇలాంటివి కాస్త తక్కువగానే కనిపిస్తాయి. కాస్త ఎక్కువ చనువుగా ఉండేవారితో సన్నిహితంగా కనిపించడం చూస్తుంటాం. కానీ గోవా బ్యూటీ ఇలియానా మాత్రం ఆశ్చర్యకరంగా ఓ ఫ్యాషన్ డిజైనర్ భుజాలపై కనిపించింది.

ఇలియానాకు షూస్ అంటే పిచ్చి ఈ విషయం తనే గతంలో చెప్పింది కూడా. "నాకు ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ఓ రూమ్ అంతా షూస్. చెప్పల్స్, హై హీల్స్ తో నింపేస్తాను" అనింది కూడా. రీసెంట్ గా ఓ ఫ్యాషన్ వీక్ లో క్రిస్టియన్ లోబోటిన్ అనే ఫ్రెంచ్ ఫ్యాషన్ షూ డిజైనర్ ను కలిసింది ఇల్లీ బేబీ. ఇద్దరూ బోలెడంత సేపు కబుర్లు చెప్పుకుని.. బాగా క్లోజ్ అయిపోయారు కూడా. "తను హై హీల్స్ లో ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. తన నడక కూడా చాలా అద్భుతంగా ఉఁటుంది." అంటూ ఇలియాను పొగిడేశాడి క్రిస్టియన్ లోబోటిన్. అయితే.. ఇదేమీ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ డిజైనర్ తన భుజాలపై ఇలియానాను మోస్తూ.. ఇల్లీ వేసుకున్న హీల్స్ కనిపించేలా ఫోటోకు పోజ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయిపోయింది.

గతంలోనూ ఓ పార్టీలో వీరిద్దరు కలిశారని తెలుస్తోంది. అఫ్పటి నుంచి ఇల్లీ-డిజైనర్ ల మద్య సాన్నిహిత్యం ఏర్పడిందట. "తను ఫేమస్ డిజైర్ అని చాలా సార్లు మరిచిపోతుంటా. తను నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే" అంటూ తమ మధ్య చనువు ఏ రేంజ్ లో ఉందో చెబుతోంది ఇల్లీ బేబీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/