Begin typing your search above and press return to search.
ఫర్జీ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
By: Tupaki Desk | 12 Feb 2023 4:35 PM ISTరాజ్ అండ్ డీకే దర్శద్వయం అంటే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గుర్తుకొస్తుంది. ఆ సిరీస్ లో ఇప్పటి వరకు రెండు పార్ట్శ్ ని వారు తెరకెక్కిస్తే ఆ రెండు బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. సినిమాల కంటే వెబ్ సిరీస్ లతో మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటు భాగా గుర్తింపు పొందిన ఈ ఇద్దరు దర్శకులు అటు వైపు సినిమాలని తెరకెక్కిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ని సమంతా, వరుణ్ ధావన్ కాంబినేషన్ లో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా వీరు ఫర్జీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ ఇందులో మెయిన్స్ లీడ్స్ లో నటించడంతో దీనికి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ వెబ్ సిరీస్ కథలోకి వెళ్తే డీమోనిటైజేషన్ నేపధ్యంలో కథ నడుస్తుంది. నోట్ల రద్దు కారణం చిన్న చిన్న బొమ్మలు వేస్తూ లైఫ్ ని లీడ్ చేసే సన్నీ( షాహిద్ కపూర్) సంపాదన లేక అప్పులపాలవుతాడు. అదే సమయంలో తన తాతయ్య నడిపించే విప్లవ పత్రిక అప్పుల కారణంగా మూతబడుతుంది. దాంతో డబ్బు కోసం సన్నీ తన ఫ్రెండ్ తో కలిసి దొంగ నోట్ల ముద్రణ మొదలు పెడతాడు.
ఇక ఈ విషయాన తెలుసుకున్న దొంగనోట్ల మాఫియాని నడిపే వ్యక్తితో కలుస్తాడు. అయితే దేశంలో దొంగ నోట్ల వ్యాపారం చేసే గ్యాంగ్ స్టార్స్ ని పట్టుకోవడం కోసం ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ అధికారిగా మైఖేల్ (విజయ్ సేతుపతి) ని నియమిస్తుంది. అతనికి అసిస్టెంట్ గా రాశిఖన్నా ఉంటుంది. ఈ ఇద్దరు కలిసి దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్న మాఫియాని ఎలా గుర్తించి పట్టుకున్నారు. అసలు వారికి సన్నీ దొరికిపోయాడా. టాస్క్ ఫోర్స్ పోలీసుల నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు. దొంగ నోట్ల గ్యాంగ్ ని మైఖేల్ టీమ్ ఎలా ఫుల్ స్టాప్ పెట్టింది లాంటి కీలకమైన ఎలిమెంట్స్ తో ఫర్జీ వెబ్ సిరీస్ ఉంటుంది.
ఈ వెబ్ సిరీస్ లో మైఖేల్ పాత్రలో విజయ్ సేతుపతి ఓ వైపు ఫన్ క్రియేట్ చేస్తూ మరో వాపు మాఫియా ఆటకట్టించే పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో మెప్పించాడు. ఇక రాశిఖన్నాకి కూడా తనని తాను నటిస్తా ఎస్టాబ్లిష్ చేసుకునే పవర్ ఫుల్ రోల్ ఈ సినిమాలో వచ్చింది అని చెప్పాలి. ఇక షాహిద్ కపూర్ ఓ వైపు తాత మీద అభిమానం, మరో వైపు అప్పుల సమస్యలు వాటిని అధికమించడానికి తప్పనిసరి పరిస్థితిలో దొంగనోట్ల మాఫియాలోకి దిగడం లాంటి అంశాలతో అన్ని రకాల ఎమోషన్స్ లో బలంగా చూపించాడు. ఇక మిగిలిన పాత్రలు చేసిన వారు కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. థ్రిల్లింగ్, యాక్షన్ కథలు ఇష్టపడే వారికి ఫర్జీ నచ్చుతుంది. అయితే ఎపిసోడ్స్ ఎక్కువ సేపు నడుస్తూ కాస్తా స్లో నేరేషన్ తో అక్కడక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓవరాల్ గా ఒటీటీ ఆడియన్స్ కి ఫర్జీ నచ్చే వెబ్ సిరీస్ అవుతుంది అని చెప్పొచ్చు. దర్శకులు రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మెన్ సిరీస్ తరహాలోనే దీనిని కూడా ఇంటరెస్టింగ్ గా ఆవిష్కరించారు.