Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్‌ కు శిక్ష తప్పదా?

By:  Tupaki Desk   |   6 Oct 2020 10:45 AM IST
స్టార్‌ హీరోయిన్‌ కు శిక్ష తప్పదా?
X
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. విపక్ష పార్టీలతో కలిసి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించారు. ఆ సందర్బంగా రైతులు చేపట్టిన ఉద్యమాలకు వివిధ పార్టీల వారు మద్దతును తెలియజేశారు. సినిమా పరిశ్రమకు చెందిన వారు సైతం చాలా మంది రైతులకు మద్దతుగా నిలిచి వ్యవసాయ బిల్లుపై విమర్శలు చేశారు. ఈ విషయమై కంగనా స్పందించిన తీరు రైతులను అవమాన పర్చే విధంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. రైతులను కంగనా ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేసింది అంటూ ఆమెపై విపక్షాల వారు మరియు రైతు సంఘాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్ణాటకకు చెందిన ఎల్‌ రమేష్‌ నాయక్‌ అనే హైకోర్టు న్యాయవాది రైతుల ఆందోళనపై కంగనా చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించాడు. అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ఆమెపై ఆన్‌ లైన్‌ ద్వారా కన్నడ డీజీపీ మరియు ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అవ్వడంతో కోర్టులో విచారణ మొదలైంది. విచారణ పూర్తి అవ్వడంతో కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో కంగనాకు ఖచ్చితంగా శిక్ష పడుతుందనే ఉద్దేవశ్యంతో రమేష్‌ నాయక్‌ చెబుతున్నాడు. రైతులను విమర్శించినందుకు గాను ఆమెకు జరిమానా లేదా జైలు శిక్ష అయినా పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసు విషయంలో కంగనా చాలా భయపడుతుందని ఆమెకు త్వరలోనే శిక్ష పడబోతుందని లాయర్‌ అభిప్రాయ పడ్డాడు.