Begin typing your search above and press return to search.

ఆయనపై మనసు పడిన ఫరియా అబ్దుల్లా.. ఛాన్స్ దక్కేనా?

By:  Tupaki Desk   |   2 Nov 2022 11:30 PM GMT
ఆయనపై మనసు పడిన ఫరియా అబ్దుల్లా.. ఛాన్స్ దక్కేనా?
X
పొడుగు భామ ఫరియా అబ్దుల్లా 'జాతిరత్నాలు' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చిట్టి పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తెలుగులో భారీ విజయం సాధించడంతో ఫరియా అబ్దుల్లాకు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. ఈ అమ్మడు మాత్రం కథ నచ్చితేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

'స్లో అండ్ స్టడీ విన్ ది రేస్' అన్న ఫార్ములాతో ఫరియా అబ్దుల్లా కెరీర్ ను బిల్డప్ చేసుకుంటోంది. జాతిరత్నాలు సినిమా తర్వాత కింగ్ నాగార్జున నటించిన బంగార్రాజు మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసి కుర్రకారును మెస్మరైజ్ చేసింది. నటన పరంగానే కాకుండా ఈ భామ హైట్ పరంగానూ టాలీవుడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

ఫరియా అబ్దుల్లా తాజా చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్‏స్క్రైబ్'. ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. నవంబర్ 4న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్రబృందం విరివిగా ప్రమోషన్స్ చేస్తోంది.

ఇందులో భాగంగా ఫరియా అబ్దుల్లా.. హీరో శోభన్ సంతోష్.. దర్శకుడు గాంధీ 'అలీతో సరదాగా' షోలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ఆద్యంతం చాలా సరదాగా కొనసాగింది. ఒక సందర్భంలో కమెడియన్ అలీ మాట్లాడుతూ జాతి రత్నాలు షూటింగ్ సమయంలో దర్శకుడి నిన్ను కొట్టారట కాదా? అని ఫరియాను అడిగాడు. దీనిపై ఫరియా స్పందిస్తూ.. అనుదీప్ జోక్స్ వేసినపుడూ నవ్వుతూ పక్కనున్న వారిని కొట్టడం ఒక అలవాటని చెప్పింది. అలా నన్ను కూడా సరదాగా చేతితో అలా అన్నారని తెలిపింది.

అలాగే తనకు దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలో నటించాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించింది. 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్'తోపాటు తన చేతిలో నాలుగు సినిమాల్లో ఉన్నట్టు ఫరియా తెలిపింది. ఫరియా అబ్దుల్లా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీల్లో సందడి చేస్తోంది. 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' మూవీ ఫరియాకు ఎలాంటి హిట్ అందిస్తుందో వేచిచూడాల్సిందే.!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.