Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. ఎంబీతో చిట్టీ కొంటె రొమాన్స్ చేస్తుంద‌ట‌

By:  Tupaki Desk   |   27 Sep 2022 3:51 AM GMT
#గుస‌గుస‌.. ఎంబీతో చిట్టీ కొంటె రొమాన్స్ చేస్తుంద‌ట‌
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేష‌న్ మూవీకి కాస్టింగ్ ఎంపిక‌ల‌పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో రెండో నాయిక పాత్ర కోసం త్రివిక్ర‌మ్ సీరియ‌స్ గా ప‌లువురి పేర్ల‌ను ప‌రిశీలించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సంయుక్తా మీనన్ - మీనాక్షి చౌదరి -శ్రీలీల‌ వంటి హాట్ గాళ్స్ ని సంప్ర‌దించ‌గా వీళ్ల‌లో శ్రీ‌లీల అంగీకారం తెల‌ప‌లేదు. ఈలోగానే మ‌రో యంగ్ ట్యాలెంటెడ్ గాళ్ పైకి త్రివిక్ర‌మ్ దృష్టి మ‌ళ్లింద‌ని తెలిసింది.

'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లాని రెండో నాయికగా మాయావి ఎంపిక చేసార‌ని తెలుస్తోంది. నటించిన తొలి సినిమాతోనే ఫ‌రియా అబ్ధుల్లా కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేసింది. హైద‌రాబాదీ అంద‌గ‌త్తె న‌ట‌ప్ర‌తిభ‌కు అంతా ఫిదా అయిపోయారు.

చిట్టి పాత్ర‌లో అద్భుత‌మైన టింజ్ ని ప్ర‌ద‌ర్శించింది ఫ‌రియా అబ్ధుల్లా. ఆ త‌ర్వాత వ‌రుస‌గా క‌థానాయికగా ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. మీడియం బ‌డ్జెట్ చిత్రాల్లో ప్ర‌ముఖ బ్యాన‌ర్ల‌కు ఫ‌రియా ఓకే చెబుతోంది. ఇంత‌లోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్ సినిమాలో న‌టించేందుకు ఈ భామ అంగీక‌రించింద‌న్న గుస‌గుస వేడెక్కిస్తోంది.

అంతేకాదు ఇందులో మ‌హేష్ తో కొంటెగా రొమాన్స్ చేసే అల్ల‌ర‌మ్మాయిగాను క‌నిపిస్తుంద‌ట‌. నిజానికి ఇది షాకింగ్ ఛాయిస్ అని చెప్పాలి. మ‌హేష్ తో ఇంత‌కుముందు స‌రిలేరు నీకెవ్వ‌రులో ర‌ష్మిక మంద‌న చిలిపిగా అల్ల‌రిగా రొమాన్స్ చేసే గాళ్ గా క‌నిపించింది.

అయితే అంత‌కంటే వైవిధ్యంగా కొంటె అమ్మాయిగా ఫ‌రియా క‌నిపించాల్సి ఉంటుంది. త్రివిక్ర‌మ్ అంత‌టి వాడు రొమాన్స్ ని డిజైన్ చేస్తే అది వేరే లెవ‌ల్లో వ‌ర్క‌వుటవుతుంద‌న‌డంలో సందేహం లేదు. కానీ ఫ‌రియా పాత్ర‌కు ప్రాధాన్య‌త ఎంత అన్న‌ది చూడాలి. అలాగే ఈ చిత్రంలో చిట్టీ కోసం ఒక ప్రత్యేక పాటను కూడా డిజైన్ చేసార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. ఈ పాత్ర కథకు చాలా కీలకం. మహేష్ బాబుతో కొంటె రొమాన్స్ చేయ‌డ‌మే కాదు ఆడి పాడుతుంది.

కానీ ఈ పాత్ర స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో అదాశ‌ర్మ పాత్ర‌లా.. జ‌ల్సాలో క‌మ‌లినీ పాత్ర‌లా తేలిపోకూడ‌దు. త‌న పాత్ర‌కు మంచి నిడివి లేక‌పోయినా బ్లాస్ట్ అయ్యే రేంజులో ఉండాల‌ని అభిమానులు త్రివిక్ర‌మ్ ని కోరుతున్నారు. మ‌రి మాయావి ఏం చేస్తాడో చూడాలి. ఫ‌రియా అబ్ధుల్లా ఎంపిక గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని స‌మాచారం. ఇంత‌కీ చిట్టి ఫ‌రియా .. మంచు విష్ణు సినిమాకి ఎంపికైందని ప్ర‌చార‌మైంది. ఆ సినిమా ఏమైందో?




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.