Begin typing your search above and press return to search.

ఇంత పెద్ద సక్సెస్‌ ను ఊహించలేదంటున్న చిట్టీ

By:  Tupaki Desk   |   20 March 2021 6:30 AM GMT
ఇంత పెద్ద సక్సెస్‌ ను ఊహించలేదంటున్న చిట్టీ
X
చిన్న చిత్రంగా తెరకెక్కి ప్రమోషన్‌ తో క్రేజీ మూవీగా మారిన జాతి రత్నాలు విడుదల తర్వాత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని పెద్ద సినిమాల జాబితాలో చేరిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన టాప్ చిత్రాల జాబితాలో నిలిచింది. ఉప్పెన తర్వాత ఆ రేంజ్ వసూళ్లు సాధిస్తున్న సినిమా గా జాతి రత్నాలు నిలిచింది.

సినిమా కు వస్తున్న రెస్పాన్స్‌ చూసి చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఆడుతుందని అనుకున్నాం కాని మరీ ఈ రేంజ్ లో ఆడుతుందని తాము ఊహించలేదు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తాజాగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన సక్సెస్‌ ఎక్స్ పీరియన్స్ ను మీడియాతో షేర్‌ చేసుకుంది.

హైదరాబాద్‌ పాత బస్తీకి చెందిన ఫరియా మొదటి సినిమా జాతి రత్నాలు. డాన్స్ అంటే ఇష్టంతో ఎన్నో డాన్స్ ఫెస్టివల్స్ లో పాల్గొన్న ఫరియా ను హీరోయిన్ గా మేకర్స్ ఈ సినిమాతో పరిచయం చేశారు. ఆ ముగ్గురు తో ఏమాత్రం తగ్గకుండా ఫరియా నటించి నవ్వించింది. టాలీవుడ్ లో టాలెస్ట్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న ఫరియా మాట్లాడుతూ.. మొదటి సినిమాతో సక్సెస్‌ అనేది చాలా తక్కువ మందికి దక్కుతుంది. ఆ అవకాశం ఆ సక్సెస్‌ నాకు దక్కింది.

మహానటి వంటి సినిమాను తీసిన నాగ్ అశ్విన్ గారు నిర్మించిన సినిమా అవ్వడం వల్ల అడిగిన వెంటనే ఒప్పుకున్నాను. సినిమా విడుదల తర్వాత అంతా కూడా నన్ను చిట్టీ అని పిలుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు. ఇంత భారీ సక్సెస్ ను ఊహించలేదని చెప్పుకొచ్చింది. ఈమె తదుపరి సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.