Begin typing your search above and press return to search.

రుతుప‌వ‌నాల సాక్షిగా చిట్టి జాతిర‌త్నం మిడ్ నైట్ డ్యాన్సులు

By:  Tupaki Desk   |   20 May 2021 5:30 AM GMT
రుతుప‌వ‌నాల సాక్షిగా చిట్టి జాతిర‌త్నం మిడ్ నైట్ డ్యాన్సులు
X
హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా `జాతిర‌త్నాలు` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేసవి ప్రారంభంలో బ్లాక్ బస్టర్ కామిక్ కేపర్ లో తన అందమైన లుక్స్ ఆకట్టుకునే నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఫ‌రియా అంద‌చందాలు ఒడ్డు పొడుగు చూసి ఆర‌డుగుల అంద‌గాడైన‌ ప్రభాస్ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఫ‌రియా అబ్దుల్లా కొంత‌కాలంగా ఇన్ స్టా వేదిక‌గా త‌న డ్యాన్సింగ్ ట్యాలెంట్ కి సంబంధించిన వీడియోల్ని షేర్ చేస్తుండ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. గత రాత్రి వర్షాల సీజ‌న్ ఆరంభ వర్షంలో హైదరాబాద్ తడిసిపోతుండగా ఫ‌రియా ఇన్ స్టాగ్రామ్ లో తన డ్యాన్స్ వీడియోల్ని షేర్ చేసి అభిమానులను అలరించింది.

రుతుపవనాల రాకతో తాను ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాన‌ని ఫ‌రియా చెప్ప‌క‌నే చెప్పింది. తన డ్యాన్స్ వీడియో క్లిప్ లలో ‘ఆజా రీ మోర్ సైయన్’ పాట హైలైట్. తనవైన‌ కథక్ నైపుణ్యాలతో అల‌రించింది ఈ బ్యూటీ. ఫిల్మ్ మేకర్స్ తన భవిష్యత్ ప్రాజెక్టులలో ఫరియా డ్యాన్స్ ట్యాలెంట్ ని సద్వినియోగం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తార‌నడంలో సందేహాలేవీ అక్క‌ర్లేదు. నేటిత‌రం తెలుగ‌మ్మాయిల్లో వేగంగా ఎదిగేందుకు ఫరియా వ‌ద్ద అన్ని అస్త్రాలు ఉన్నాయ‌ని త‌న ఫీట్స్ చెబుతున్నాయి. చిట్టి ఫ‌రియా ఆకాశ‌మే హ‌ద్దుగా ఎద‌గాల‌ని ఆకాంక్షిద్దాం.