Begin typing your search above and press return to search.

డాన్స్ వీడియోతో వైరల్ అవుతున్న జాతిరత్నం..!

By:  Tupaki Desk   |   23 March 2021 9:18 AM GMT
డాన్స్ వీడియోతో వైరల్ అవుతున్న జాతిరత్నం..!
X
ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉంటే ఈజీగా స్టార్డం సొంతం చేసుకోవచ్చు అనే ఒకప్పటి మాట.. ఇప్పుడు నిజమవుతున్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే అభిమానం సంపాదించుకోవడానికి స్టార్స్ ఫ్యామిలీ వారే అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి స్టేటస్ లేకుండా కూడా సినిమాల్లో టాలెంట్ తో అవకాశం దక్కించుకొని క్లిక్ అయిపోవచ్చు. అవును.. ఇలాంటి వాటికీ ఉదాహరణగా నిలుస్తోంది ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూగా అడుగు పెట్టిన ఫరియా.. ఒకే ఒక్క సినిమాతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే జాతిరత్నాలు సినిమాలో చిట్టి అనే పాత్రలో ఒదిగిపోయి.. అదే పాటతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

అయితే ఫరియాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ విషయం ఆమె బెదురులేకుండా డాన్స్ చేసే విధానం చూస్తేనే అర్ధమవుతుంది. సోషల్ మీడియాలో ఫరియా చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఫరియా తన ఫ్రెండ్ తో కలిసి ఓ తమిళ సాంగ్ కు డాన్స్ చేసింది. 'ఎంజాయ్ ఎంజామి' అనే పాటకు ఫరియా అద్భుతంగా కాలుకదిపింది. ఇదివరకు ఫరియా చేసిన డాన్స్ వీడియోస్ కూడా నెట్టింట చాలా పాపులర్ అయ్యాయి. ఈ పాటలో లిరిక్స్ తెలియకపోయినా డాన్స్ ఇరగదీసిందనే చెప్పాలి. ఫరియా యాక్టింగ్ తో పాటు డాన్సింగ్ స్కిల్స్ చూస్తూ ఆశ్చర్యపోతున్నారు నేటిజన్లు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఫరియా మాస్ రాజా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్. చూడాలి మరి ఆఫీసియల్ న్యూస్ రానుందేమో!