Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న బర్త్ డే బ్యూటీ స్పెషల్ పిక్..!

By:  Tupaki Desk   |   28 May 2021 7:30 AM GMT
వైరల్ అవుతున్న బర్త్ డే బ్యూటీ స్పెషల్ పిక్..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో జాతిరత్నాలు సినిమా వచ్చినప్పటి నుండి చిట్టి గోల ఎక్కువైపోయింది. చిట్టీ అంటే సినిమాలో క్యారెక్టర్ గురించ కాదండి. చిట్టి క్యారెక్టర్ పోషించిన పొడుగుకాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉన్నవారికి స్టార్డం అనేది అలా వచేస్తుంది అనే మాటలు నిజం చేస్తోంది ఫరియా. ఎందుకంటే అభిమానం సంపాదించుకోవడానికి స్టార్స్ ఫ్యామిలీ వారే అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి స్టేటస్ లేకుండా కూడా సినిమాల్లో టాలెంట్ తో అవకాశం దక్కించుకొని క్లిక్ అయిపోవచ్చు. అవును.. ఇలాంటి వాటికీ ఉదాహరణగా నిలుస్తోంది ఇప్పుడు హైదరాబాది బ్యూటీ ఫరియా అబ్దుల్లా.

జాతిరత్నాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూగా అడుగు పెట్టిన ఫరియా.. ఒకే ఒక్క సినిమాతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే జాతిరత్నాలు సినిమాలో చిట్టి అనే పాత్రలో ఒదిగిపోయి.. అదే పాటతో కుర్రహృదయాలకు బాగా కనెక్ట్ అయింది. ఈరోజు ఫరియా అబ్దుల్లా పుట్టినరోజు. అందుకే సోషల్ మీడియా వేదికగా అమ్మడికి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫరియాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ విషయం ఆమె బెదురులేకుండా డాన్స్ చేసే విధానం చూస్తేనే అర్ధమవుతుంది. సోషల్ మీడియాలో ఫరియా చాలా యాక్టీవ్ ఉంటూ.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవలే ఫరియా తన సాంగ్స్ కు డాన్స్ చేసింది.

ఏ భాషలో పాటకైనా ఫరియా అద్భుతంగా కాలుకదుపుతుంది. ఇదివరకు ఫరియా చేసిన డాన్స్ వీడియోస్ కూడా నెట్టింట చాలా పాపులర్ అయ్యాయి. ఈ పాటలో లిరిక్స్ తెలియకపోయినా డాన్స్ ఇరగదీసిందనే చెప్పాలి. ఫరియా యాక్టింగ్ తో పాటు డాన్సింగ్ స్కిల్స్ చూస్తూ ఆశ్చర్యపోతున్నారు నేటిజన్లు. అయితే ఈరోజు ఫరియా తన 23వ యేట అడుగుపెడుతోంది. మొదట యూట్యూబ్ ఛానల్స్ లో ప్రోగ్రాంస్ చేస్తూ పాపులర్ అయిన ఫరియా జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫరియా ఫోటోలు వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఫరియా మాస్ రాజా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఈ విషయం పై ఆఫీసియల్ న్యూస్ రానుందేమో!