Begin typing your search above and press return to search.

బీరు వ‌ద్దు బ్రీజ‌ర్ ముద్దంటున్న చిట్టి ఫ‌రియా

By:  Tupaki Desk   |   9 Sep 2021 12:30 AM GMT
బీరు వ‌ద్దు బ్రీజ‌ర్ ముద్దంటున్న చిట్టి ఫ‌రియా
X
తెలుగ‌మ్మాయి ఫరియా అబ్దుల్లా న‌టించిన‌ తొలి చిత్రం `జాతి రత్నాలు`తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. క్యూట్ లుక్స్ నాటీ పెర్ఫామెన్స్ తో గుండెల్ని గుల్ల చేసింది ఈ హైద‌రాబాదీ సోయ‌గం. ఫ‌రియా విలక్షణమైన వ్యక్తిత్వం ప్రేక్ష‌కుల‌ దృష్టిని ఆకర్షించింది.

ఫ‌రియాకు ఇన్ స్టాగ్రామ్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది. తరచుగా ఆమె డ్యాన్స్ వీడియోలతో షేక్ చేస్తుంటుంది. స్వ‌త‌హాగానే తాను క్లాసిక్ డ్యాన్స‌ర్ కం వెస్ట్ర‌న్ డ్యాన్సింగ్ స్టైల్స్ లో నైపుణ్యం ఉన్న తార కాబ‌ట్టి త‌న డ్యాన్సుల‌కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది. ఫ‌రియాకి డ్యాన్సులు న‌ట‌న కాకుండా ఇంకే అల‌వాటు ఉంది? అంటే.. వ్య‌క్తిగ‌తంగా బ్రీజ‌ర్ సేవించ‌డం అంటే ఇష్ట‌మ‌ట‌. బకార్డి బ్రీజర్ ఇండియా లీగల్ ఏజ్ డ్రింక్స్ కంటే ముందున్న వాటిలో ఒకటి. ఇప్పుడు ఫరియా త‌న ఫేవ‌రెట్ బ్రాండ్ తో చిలౌట్ చేస్తూ క‌నిపించింది.

చేతిలో బ్రీజర్ బాటిల్‌తో నృత్యం చేస్తున్న వీడియో తాజాగా వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో అమ్మ‌డిలో ఉద్వేగం ఉత్సాహం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ఫరియా డ్రెస్సింగ్ సెన్స్ ఎన‌ర్జీ మ‌రో అదనపు ఆకర్షణగా ఉంది. జీవితం అంతా వినోదం ఆనందం అభిరుచి మేళ‌వింపు అనేది త‌న ఉద్ధేశం కావొచ్చు. మొత్తానికి బ్రీజ‌ర్ ప్రచారాన్ని కూడా త‌న‌దైన శైలిలో సరదాగా కానిచ్చేస్తోంది. బ్రీజర్ అనేది పండ్ల ఆధారిత ఆల్కహాలిక్ డ్రింక్. ఇది భారతదేశంలో 4.8 శాతం ఆల్కహాల్ ని క‌లిగి ఉంటుంది. ఇంచుమించి బీర్ తో స‌మానం. కానీ పండ్ల ర‌సం రుచితో అంద‌రికీ న‌చ్చేస్తుంది. ఇక‌పోతే ఇటీవ‌ల ఏపీలో ఆల్క‌హాల్ అమ్మ‌కాల్లో బ్రీజ‌ర్ మాయ‌మ‌వ్వ‌డం పెద్ద షాకిచ్చింది. కేవ‌లం బార్ల‌లో మాత్ర‌మే బ్రీజ‌ర్లు అమ్ముతున్నారు మ‌రి. తెలంగాణ‌లో అయితే మంచి బ్రాండ్ల‌కు అడ్డు లేదు.