Begin typing your search above and press return to search.

'రాబందులు నీ చుట్టూ గుమిగూడాయి' అంటూ ఫర్హాన్ అక్తర్ సంచలన ట్వీట్...!

By:  Tupaki Desk   |   16 Jun 2020 11:30 AM GMT
రాబందులు నీ చుట్టూ గుమిగూడాయి అంటూ ఫర్హాన్ అక్తర్ సంచలన ట్వీట్...!
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌ లో తీవ్ర కలకలం రేపుతోంది. వరుస విజయాలతో ఇండస్ట్రీలో ముందుకు పోతున్న హీరో ఇలా సడన్ గా ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ది ఆత్మహత్యే అని పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చింది. అయితే ఆయన కుటుంబ సభ్యులు.. పలువురు నేతలు ఆయన మృతిపై డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్య కాదని అది హత్య అని.. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మరోవైపు సుశాంత్ మరణంపై బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలు, ప్రొడ్యూసర్స్ ని ట్రోల్ చేస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సుశాంత్ మరణించి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా సోషల్ మీడియాలో సుశాంత్ కి సంభందించిన న్యూస్‌ ట్రెండ్ అవుతూనే ఉంది. సుశాంత్ మరణానికి బాలీవుడ్‌ లో పలువురు ఇండస్ట్రీ పెద్దలే బాధ్యత వహించాలని.. 'బాయ్ కాట్ బాలీవుడ్' అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మరణవార్తను జీర్ణించుకోలేని అతడి శ్రేయోభిలాషులు, అభిమానులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ కి అన్యాయం జరిగిందంటూ ట్వీట్లు, కవితలు, భావోద్వేగమైన సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. కంగన రనౌత్, శేఖర్ కపూర్, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖుల తర్వాత దర్శక నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్ ట్విట్టర్ వేదికగా సుశాంత్ మృతిపై స్పందించారు. ఫర్హాన్ భావోద్వేగంతో కూడిన కవితను ట్విట్టర్‌ లో పోస్టు చేశాడు. ''నిద్రపో నా సోదరా నిద్రపో.. రాబందులను నీ చుట్టూ గుమిగూడనివ్వు.. మొసలి కన్నీళ్లు కార్చనివ్వు.. సర్కస్‌ లో మాదిరిగా కొందర్ని తమ ప్రదర్శనను కొనసాగించనివ్వు.. నీ వద్ద మోకరిల్లనివ్వు.. నీ గురించి కీచురాళ్ల శబ్దాలు చేయనివ్వు.. మనుషుల్లో అజ్ఞానం ఇంకా పెరుగనివ్వు.. ఘాడ నిద్రలోకి జారుకో నా సోదరా నిద్రపో'' అంటూ ఫర్హాన్ 'సుశాంత్ ఆత్మకు శాంతి కలుగాలని' ప్రార్థించాడు. దీంతో ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన వారిని తొక్కేస్తారనే కంగనా వ్యాఖ్యలకు బలం చేకూరుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.