Begin typing your search above and press return to search.

క్లాసిక్స్‌ పై కక్ష కట్టావేంటి లారెన్స్‌?

By:  Tupaki Desk   |   10 Aug 2020 7:00 PM IST
క్లాసిక్స్‌ పై కక్ష కట్టావేంటి లారెన్స్‌?
X
కొరియోగ్రాఫర్‌ గా కెరీర్‌ ను ప్రారంభించి నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఇలా ఎన్నో రంగాల్లో తనదైన ముద్రను వేసిన లారెన్స్‌ ఆల్‌ రౌండర్‌ అనిపించుకున్నాడు. అన్ని విధాలుగా లారెన్స్‌ కేవలం సౌత్‌ ఇండియాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. రాఘవ లారెన్స్‌ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల గురించి జనాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. అవే చంద్రముఖి మరియు రంగస్థలం. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాల వర్క్‌లో లారెన్స్‌ బిజీగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది.

చంద్రముఖి సీక్వెల్‌ను చేయబోతున్నట్లుగా లారెన్స్‌ నుండి ప్రకటన వచ్చింది. రజినీకాంత్‌ పోషించిన పాత్రను కాకుండా ఆయన శిష్యుడి పాత్రలో లారెన్స్‌ నటించబోతున్నాడు. రజినీకాంత్‌ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ మూవీ అయిన చంద్రముఖి వంటి బిగ్‌ మూవీని సీక్వెల్‌ చేయడం అంటే అది సరైన నిర్ణయం కాదంటున్నారు. ఒక వేళ రజినీకాంత్‌ ఆ సీక్వెల్‌ లో నటిస్తే బాగుండేదంటున్నారు. లారెన్స్‌ ఎంతగా చంద్రముఖి సినిమాతో మెప్పిస్తాడు అనేది చెప్పలేము. కనుక ఆ సినిమా ఫ్లాప్‌ అయితే లారెన్స్‌ పెద్ద తప్పు చేసిన వాడు అవుతాడు.

ఇక తాజాగా రంగస్థలం చిత్రంను లారెన్స్‌ రీమేక్‌ చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. రామ్‌ చరణ్‌ ఇండస్ట్రీ హిట్‌ చిత్రం అయిన రంగస్థలంను తమిళంలో రీమేక్‌ చేయాలనుకోవడం మంచి నిర్ణయం. కాని హీరోగా విజయ్‌ నో లేదంటే మరో స్టార్‌ హీరోనో చేయిస్తే బాగుండేది. కాని లారెన్స్‌ చేయడం వల్ల సినిమా గౌరవం తగ్గుతుందనే అభిప్రాయంను కొందరు మెగా ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో లారెన్స్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ రెండు సినిమాలకు లారెన్స్‌ కమిట్‌ అవ్వడం సాహస నిర్ణయం అంటున్నారు. ఆ రెండు సూపర్‌ హిట్స్‌ పై నీకు అంత కక్ష ఎందుకు లారెన్స్‌ అంటూ నెటిజన్స్‌ సరదాగా మీమ్స్‌ క్రియేట్స్‌ చేస్తూ ట్రోల్స్‌ చేస్తున్నారు.