Begin typing your search above and press return to search.

సామ్ ని అలాంటి క్యారెక్టర్ లో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా...?

By:  Tupaki Desk   |   17 May 2020 1:30 AM GMT
సామ్ ని అలాంటి క్యారెక్టర్ లో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా...?
X
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది సమంత. తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతంగా నటించగలిగే నైపుణ్యం ఆమె సొంతం. దశాబ్దకాలంగా తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తూ సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన మొదటి హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. అక్కినేని వారి కోడలిగా మారారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చైతన్య ని పెళ్ళి చేసుకున్నాక గ్లామర్ పాత్రలను పక్కన పెట్టింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలని.. అలాగే కథా బలమున్న పాత్రలని ఎంచుకుంటూ సక్సస్ లని అందుకుంటుంది. గతేడాది తెలుగులో 'మజిలీ' 'ఓ బేబి' సినిమాలతో వరసగా రెండు హిట్స్ అందుకున్న సమంత ఈ ఏడాది 'జాను'తో పలకరించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఆశించినతగా రాలేదనే చెప్పాలి. అయితే నటిగా సమంతకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

సమంత సినిమాల్లో నటిస్తూనే ఒక వెబ్ సిరీస్‌ ద్వారా డిజిటల్ మీడియా రంగంలోకి అడుగు పెడుతోంది. ఇది ‘ది ఫ్యామిలీ మ్యాన్'కు సీక్వెల్‌ గా వస్తోంది. ఈ సిరీస్‌ ను తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు - కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ మంచి ఆదరణని దక్కించుకుంది. మనోజ్ బాయ్ పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్ సీజన్ 2 లో ఆ ఇద్దరి తో పాటు సమంత నటిస్తోంది. స్పై థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్‌ లో సామ్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. అది ఒక టెర్రరిస్ట్ పాత్ర అని కూడా వార్తలు వస్తున్నాయి. దాని ప్రకారం ఇందులో సామ్ చేతిలో వెపన్స్ పట్టుకుని కనిపిస్తుందట. గన్స్ గ్రానైట్స్ ఇలా ఎన్నో రకాల ఆయుధాలతో ఆమె ఇప్పటి వరకూ చేయని స్టంట్స్ చేయబోతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీటయిందట. అక్టోబర్ లో ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేయనున్నారు. అయితే సమంత నెగిటివ్ రోల్ లో కనిపిస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో విక్రమ్ హీరోగా వచ్చిన '10' అనే సినిమాలో కూడా సమంత ఒక పాత్రలో విలన్ గా కనిపించింది. మరి ఈ 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ఆమెకి ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి.