Begin typing your search above and press return to search.
స్టార్ కిడ్స్ ని కూడా వదలని ఫ్యాన్స్...!
By: Tupaki Desk | 30 Aug 2020 5:00 PM ISTటాలీవుడ్ లో హీరోలపై ఫ్యాన్స్ తమ అభిమానాన్ని ఆ రేంజ్ లో చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోల కోసం అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ వారి ఇంట్లో పండుగ లాగా సెలెబ్రేట్ చేస్తుంటారు. వారి సినిమాలు రిలీజైతే నిద్రాహారాలు మాని కటౌట్స్ బ్యానర్లు కడుతూ థియేటర్స్ దగ్గర నానా హంగామా చేస్తుంటారు. ఒక్కోసారి హద్దులు మీరి ఇతర హీరోల అభిమానులతో గొడవలకు దిగి తలలు పగలగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వంద రోజుల సెంటర్లు అని.. సినిమా కలెక్షన్ల రికార్డుల గురించి కొట్టుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో తేల్చుకుంటున్నారు. ముఖ్యంగా హీరోల పుట్టినరోజు వస్తే ఎవరెక్కువ ట్వీట్లు వేశారన్నది ప్రతిష్టాత్మకంగా మారింది. హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసారు. ఈ నేపథ్యంలో ఇతర హీరోల బర్త్ డే ట్రెండ్ కి ఏమాత్రం తగ్గకూడదంటూ సోషల్ మీడియాను తమ పోస్టులతో ఊపేస్తున్నారు. మా హీరో ట్రెండ్ ఇన్ని మిలియన్ ట్వీట్స్ తో వరల్డ్ రికార్డ్ కొట్టిందని మిగతా హీరోల అభిమానుల ముందు గొప్పగా చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ ట్వీట్ వార్ ఇప్పుడు కేవలం హీరోలకే కాకుండా హీరోల పిల్లల ట్రెండ్ విషయంలో కూడా స్టార్ట్ అయింది.
కాగా ప్రస్తుతం స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు - యంగ్ టైగర్ ఎన్టీఆర్ - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ వంటి హీరోల పిల్లల బర్త్ డేస్ కి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు పిల్లలు గౌతమ్ కృష్ణ - సితార పుట్టినరోజుకి ట్విట్టర్ లో ట్రెండ్ చేసారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ బర్త్ డే నాడు అల్లు అర్జున్ - అఖిల్ లకు పోటీగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అల్లు అర్జున్ పిల్లలు అర్హ - అయాన్ ల పుట్టినరోజుకి మిగతా స్టార్ కిడ్స్ కి పోటీగా ట్వీట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్ - భార్గవ్ రామ్ బర్త్ డే లకి ట్రెండ్ చేయడం చూసాం. ఇలా హీరోల అభిమానులు స్టార్ కిడ్స్ ని కూడా వదలడం లేదు. స్టార్ కిడ్స్ ట్రెండ్స్ విషయంలో కూడా ట్వీట్ వార్ జరుగుతుంది. వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ ఉండటానికి కారణం కూడా అభిమానులే అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరి రాబోయే రోజుల్లోనైనా ఫ్యాన్స్ అర్థం చేసుకొని ఈ సోషల్ మీడియాలో స్టార్ కిడ్స్ ట్రెండ్ వార్ కి ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.