Begin typing your search above and press return to search.

అర్జునుడిగా ప్రభాస్ ను చూడాలనుకుంటోన్న అభిమానులు!

By:  Tupaki Desk   |   2 May 2021 6:00 AM IST
అర్జునుడిగా ప్రభాస్ ను చూడాలనుకుంటోన్న అభిమానులు!
X
తెరపై 'బాహుబలి' చూస్తున్నప్పుడు రాజమౌళి చారిత్రక .. పౌరాణికాలు కూడా అద్భుతంగా తీయగలరని అనుకున్నారు. అలాగే రాజుగా ప్రభాస్ ను చూసినప్పుడు కూడా ఇది చారిత్రక .. పౌరాణికాలకు సరిగ్గా సరిపోయే విగ్రహమేనని చెప్పుకున్నారు. అదే సమయంలో 'మహాభారతం'ను రూపొందించడం తన డ్రీమ్ అనే విషయాన్ని రాజమౌళి స్పష్టం చేశారు. దాంతో ఆయన తదుపరి సినిమా అదేననే ప్రచారం జరిగింది. అందులో ప్రభాస్ కి 'అర్జునుడు'గా అవకాశం దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అభిమానుల స్పందనకు రాజమౌళి ప్రతి స్పందిస్తూ .. 'మహాభారతం' తీయాలంటే దర్శకుడిగా తనకి మరింత అనుభవం అవసరమని అనుకుంటున్నట్టు చెప్పారు. సరే .. ఎప్పుడైనా తీయనీ .. అందులో ప్రభాస్ లేకుండా ఎలా ఉంటాడని అభిమానులు సర్ది చెప్పుకున్నారు. ఆ తరువాత రాజమౌళి - ప్రభాస్ ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు. అయితే ఎప్పుడైతే హిందీలో 'ఆది పురుష్'ను ఎనౌన్స్ చేశారో, రాముడు ప్రభాస్ అని తేల్చారో అప్పుడు టాలీవుడ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

ప్రభాస్ ను పౌరాణికాలకి రాజమౌళి పరిచయం చేస్తే బాగుంటుందని వాళ్లు అనుకున్నారు. గ్రాఫిక్స్ విషయాన్ని పక్కన పెడితే, పౌరాణిక కథలపై .. పాత్రలపై తెలుగువారికే పట్టు ఎక్కువగా ఉంటుంది. పాత్రలను తీర్చిదిద్దే విధానం వేరుగా ఉంటుంది. ఇకనైనా అర్జునుడి పాత్రను ప్రధానంగా చేసుకుని రాజామౌళి 'మహాభారతం'ను రూపొందిస్తే బాగుంటుందనీ, ఆ పాత్రకి ప్రభాస్ కరెక్టుగా సెట్ అవుతాడని భావిస్తున్నారు. ద్రౌపదితో పాటు సుభద్ర .. ఉలూచి .. చిత్రాన్గదలతో అర్జునుడి పరిణయం, ఊర్వశి శాపం తాలూకు సన్నివేశాలలో ప్రభాస్ ను ఊహించుకుంటున్నారు. మరి వాళ్ల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.