Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరో సీక్వెల్స్ కోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్‌

By:  Tupaki Desk   |   1 July 2021 1:30 PM GMT
యంగ్‌ హీరో సీక్వెల్స్ కోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్‌
X
యంగ్‌ ట్యాలెంటెడ్‌ హీరో అడవి శేష్‌ మేజర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ఆ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. కరోనా కారణంగా మూత పడ్డ థియేటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభం అయిన వెంటనే విడుదల చేయాలని మేకర్స్ వెయిట్‌ చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చిన అడవి శేష్‌ మళ్లీ ఎప్పుడెప్పుడు షూటింగ్‌ లను మొదలు పెడతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సీక్వెల్స్‌ ను అడవి శేష్‌ అనౌన్స్ చేశాడు. ఆ సీక్వెల్స్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. గూడఛారి 2 మరియు హిట్‌ 2 లను ఈయన చేయాల్సి ఉంది. ఆ సినిమా షూటింగ్‌ లు అతి త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయి.

యూఎస్‌ లో ఉన్న అడవి శేష్‌ ఎప్పుడెప్పుడు తిరిగి వచ్చి ఈ సినిమా లను మొదలు పెడతాడా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరి కొన్ని సినిమా లు కూడా చర్చల దశలో ఉన్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గిన కారణంగా వెంటనే షూటింగ్ లను మొదలు పెట్టిన యంగ్‌ హీరోలు చకచక పూర్తి చేస్తున్నారు. కాని అడవి శేష్‌ నుండి ఇంకా ఎలాంటి అప్ డేట్ లేక పోవడంతో అభిమానులు ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు.

అడవి శేష్‌ గతంలో చేసిన గూడఛారి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యాక్షన్‌ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సీక్వెల్‌ ను ప్లాన్‌ చేశాడు. స్వతహాగా రచయిత అయిన అడవి శేష్‌ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రొమాంటిక్ కమ్ లవ్‌ ఎంటర్‌ టైనర్‌ సినిమాల జోలికి వెళ్లకుండా కేవలం థ్రిల్లర్‌.. యాక్షన్‌ సినిమాలను మాత్రమే చేస్తున్న అడవి శేషు వచ్చే ఏడాది కనీసం రెండు మూడు సినిమాలతో అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు.