Begin typing your search above and press return to search.

ఏంటీ ఇది నిజ‌మా? ప‌వ‌న్ వార‌సుడు గ్రాండ్ ఎంట్రీ లేన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   6 Dec 2020 11:21 AM IST
ఏంటీ ఇది నిజ‌మా? ప‌వ‌న్ వార‌సుడు గ్రాండ్ ఎంట్రీ లేన‌ట్టేనా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వార‌సుడు అకీరానంద‌న్ సినీఆరంగేట్రం గ‌త కొంత‌కాలంగా హాట్ గాపిక్ గా మారింది. అయితే అకీరా నంద‌న్ వ‌స్తున్నాడా లేదా? అంటే దానికి రేణు ఇదివ‌ర‌కే స‌మాధాన‌మిచ్చారు. అకీరా ఇంకా చిన్న‌పిల్లాడేన‌ని చ‌దువుల్లో బిజీగా ఉన్నాడ‌ని స‌మ‌యం వ‌స్తే తానే వెల్ల‌డిస్తాన‌ని రేణు దేశాయ్ అన్నారు.

కానీ తాజా ఫిలింన‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం.. అకీరా ఎంట్రీ 2011లో ఉంటుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అడివి శేష్ `మేజర్` మూవీతో అరంగేట్రం చేయడానికి అకిరా నందన్ సిద్ధమ‌వుతున్నార‌ని ప్ర‌చారం సాగ‌తోంది.

శేష్ ప్ర‌ధాన పాత్ర‌లో మేజర్ మూవీ ఇటీవలి ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ మూవీని ఘ‌ట్ట‌మ‌నేని బ్యాన‌ర్ లో మ‌హేష్ స్వ‌యంగా నిర్మిస్తుండ‌డం న‌మ్ర‌త ప్ర‌తిదీ చూస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెరిగింది. పవర్ స్టార్ వార‌సుడు అకీరా అతిధి పాత్రతో తెరంగేట్రం చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ లో ఆరాలు మొద‌ల‌య్యాయి.

నిజానికి అకీరా ఎంట్రీ ఘ‌నంగా ఉండాల‌న్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఆకాంక్ష‌. ఇలా అతిథి పాత్ర‌లో కాకుండా పూర్తి స్థాయి ప‌వ‌ర్ ప్యాక్డ్ సినిమాతో రంగంలోకి దిగాల‌ని కోరుకుంటున్నారు. ప‌వ‌ర్ స్టార్ లెగ‌సీని ముందుకు న‌డిపించే వార‌సుడిగా అకీరా రంగ ప్ర‌వేశం చేయాల‌న్న ప‌ట్టుద‌ల అభిమానుల్లో ఉంది. మ‌రి అత‌డిపై ఊహాగానాలు నిజ‌మ‌వుతాయా? అన్న‌దానికి స‌రైన ఆన్స‌ర్ రావాల్సి ఉంది.

ఆడివి శేష్ న‌టిస్తున్న‌ మేజర్ మూవీకి గూఢ‌చారి ఫేం శశి కిరణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదివ‌ర‌కూ మేజ‌ర్ లుక్ రివీలై అంత‌ర్జాలంలోకి దూసుకెళ్లింది. కొన్నేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ అధికారి సుందీప్ ఉన్నికృష్ణన్ జీవిత క‌థ ఆధారంగా మేజర్ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో దేశ‌వ్యాప్తంగా రిలీజ్ చేయాల‌న్న‌ది ఘ‌ట్ట‌మ‌నేని కాంపౌండ్ ప్లాన్.