Begin typing your search above and press return to search.

మ్..మ్..మ్‌.. ముద్దంటే చేదా?

By:  Tupaki Desk   |   28 Jan 2019 8:54 AM GMT
మ్..మ్..మ్‌.. ముద్దంటే చేదా?
X
మ్..మ్..మ్‌.. ముద్దంటే చేదా? .. నీకా ఉద్ధేశం లేదా? .. ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీస్ ఓపెన్ కిస్సెస్ వీక్షించే వాళ్ల‌కు వీక్షించినంత‌.. ఆస్వాధించే వాళ్ల‌కు ఆస్వాధించినంత‌.. ఇదో నిరంత‌ర‌ హాట్ టాపిక్. ప‌లు సంద‌ర్భాల్లో ప‌లువురు సెల‌బ్రిటీలు వేదిక‌ల‌పై ఇలా ఓపెన్ గానే ముద్దాడేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అటు హాలీవుడ్, ఇటు బాలీవుడ్ అన్నిచోట్లా ఈ త‌ర‌హా స‌న్నివేశం క‌నిపిస్తోంది. ప్రేమ‌తో ముద్దు.. అభిమానంతో హ‌గ్గు! చాలా కామ‌న్ ఇక్క‌డ‌. అయితే ప్ర‌పంచవ్యాప్తంగా కోట్లాది పాలోవ‌ర్స్ ఉన్న సెల‌బ్స్ ఇలా ప‌బ్లిక్ వేదిక‌పై ఈ స‌ర‌స‌మేల‌? అంటూ యూత్ లో వేడెక్కించే చ‌ర్చ సాగుతోంది.

తాజాగా హాలీవుడ్ ఫేమ‌స్ సెల‌బ్రిటీస్.. గాయ‌నీమ‌ణులు జులియా మైకేల్స్ - సెలీనా గోమెజ్..ఇలా ఓ ప‌బ్లిక్ వేదిక‌పై ముద్దాడేసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. వేడెక్కిస్తున్న ఈ ఫోటోలు ప్ర‌స్తుతం యువ‌త‌రం వాట్సాప్ లు, సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి. సెలీనా క్యూట్ చిక్స్ పై జులియా గోముగా ముద్దాడేస్తూ ఎంతో ప్రేమ‌గా స్ప‌ర్శిస్తోంది.

ఆస‌క్తిక‌రంగా ఈ ఇద్ద‌రూ క‌లిసి ఓ ఆల్బ‌మ్ ని అభిమానుల ముందుకు తెచ్చేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు. ``నా ముద్దుల చెల్లెలా.. నువ్వు నా జీవితంలో భాగం. నాలో నేను సందేహంతో ర‌గిలిపోయేప్పుడు నువ్విచ్చే బాస‌ట ఎంతో గొప్ప‌ది`` అంటూ తెగ ఇదైపోయింది సెలీనా గోమెజ్. జులియాతో క‌లిసి తాను చేస్తున్న ఆల్బ‌మ్ `ట‌కి ట‌కి సింగ‌ర్` త్వ‌ర‌లోనే రిలీజ్ కి రానుంది. అస‌లే 2018లో సెలీనా కెరీర్ అంతంత మాత్రంగా ఉంది. అందువ‌ల్ల తాను ఈ కొత్త ఆల్బ‌మ్ విష‌యంలో ఎంతో ఎమోష‌న్ అయిపోతోంది. ఆస‌క్తిక‌రంగా ఈ ఫోటోలో జులియా ప‌చ్చ బొట్లు కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత పెడుతున్నాయ్. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆడుతూ పాడుతూ ఉంటే.. బోయ్స్ కంటికి కునుకు క‌రువ‌వ్వ‌డం క‌ష్ట‌మేన‌ని సిగ్న‌ల్ అందింది క‌దూ?