Begin typing your search above and press return to search.

పూరి డాటర్‌ కు ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌

By:  Tupaki Desk   |   21 July 2020 3:00 PM GMT
పూరి డాటర్‌ కు ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌
X
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ తన కొడుకు మరియు కూతురును ఎప్పుడో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆకాష్‌ మరియు పవిత్ర లు పలు సినిమాలతో అలరించారు. ఆకాష్‌ ఇప్పుడు హీరోగా చేస్తుంటే పవిత్ర మాత్రం పూర్తిగా చదువుపై శ్రద్ద పెట్టింది. అప్పుడప్పుడు తండ్రి సినిమాల వర్క్‌ చూస్తూ ఉంటుంది. ఇక సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. సోషల్‌ మీడియాలో పవిత్ర ఫాలోవర్స్‌ సంఖ్య భారీగానే ఉంటుంది. రెగ్యులర్‌ గా తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఉండే పవిత్ర తనకంటూ అభిమానులను ఏర్పర్చుకుంది.

ఇటీవల పవిత్ర మరింత అందంగా నాజూకుగా తయారు అయ్యింది. ఆమె సోషల్‌ మీడియాలో పెట్టే పోస్ట్‌ లతో హీరోయిన్‌ గా ట్రై చేయనుందా అన్నంతగా ఉన్నాయి. హీరోయిన్‌ గా ఈమె ప్రయత్నాలు చేస్తే ఫిల్మ్‌ మేకర్స్‌ ఆమెను పరిచయం చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కాని పవిత్రకు హీరోయిన్‌ గా నటించేందుకు ఆసక్తి లేదని గతంలో పూరి క్లారిటీ ఇచ్చాడు. నిర్మాణంపై ఆమెకు ఉన్న ఆసక్తిని తాను గమనించానంటూ పూరి చెప్పాడు. భవిష్యత్తులో తన నిర్మాణ సంస్థను పవిత్ర నడిపిస్తుందని అనుకుంటున్నాను అంటూ పూరి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఆమద్య ఒక సినిమాలో పవిత్ర నటించబోతుంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో పూరి పై క్లారిటీ ఇచ్చాడు. అంతటి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా పవిత్ర కొత్త ఫొటోలు చూసిన నెటిజన్స్‌ మాత్రం ఆమెను హీరోయిన్‌ గా చూడాలని ఆశపడుతున్నామంటున్నారు. చాలా మంది ఫ్యాన్స్‌ మరియు ఫాలోవర్స్‌ పవిత్రను హీరోయిన్‌ గా ప్రయత్నించమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కాని ఆమె మాత్రం ఇప్పటి వరకు నెటిజన్స్‌ రిక్వెస్ట్‌ కు కనీసం సమాధానం కూడా చెప్పలేదు. కొందరు మాత్రం ఆమె మౌనంగా ఉంటే అంగీకారమేనేమో అంటున్నారు. పవిత్ర హీరోయిన్‌ గా వచ్చేనా అనేది కాలమే నిర్ణయిస్తుంది.