Begin typing your search above and press return to search.

పంజాబ్‌ వాళ్లకు మహేష్‌ అంటే మరీ ఇంత మోజా?

By:  Tupaki Desk   |   5 Feb 2019 5:23 PM GMT
పంజాబ్‌ వాళ్లకు మహేష్‌ అంటే మరీ ఇంత మోజా?
X
ఈమద్య కాలంలో తెలుగు, తమిళంకు చెందిన కాస్త పెద్ద సినిమాలన్నీ కూడా హిందీలో డబ్‌ అవ్వడం సర్వ సాదారణం అయ్యింది. హిందీలో డబ్‌ అయ్యి మూవీ ఛానెల్స్‌ లో ప్రసారం అవ్వడంతో పాటు, యూట్యూబ్‌ లో నార్త్‌ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తున్నాయి. ఈమద్య కాలంలో పంజాబ్‌ లో మహేష్‌ బాబు పాత సినిమాలు యూట్యూబ్‌ లో సందడి చేస్తున్నాయి. హిందీ వర్షన్‌ అయినా కూడా మహేష్‌ బాబు సినిమాలను ఎక్కువగా చూస్తున్నారు. మహేష్‌ బాబుకు ఈమద్య కాలంలో పంజాబీస్‌ బాగా ఫ్యాన్స్‌ అయ్యారు.

సోషల్‌ మీడియా రిపోర్ట్‌ ప్రకారం పంజాబ్‌ లో మహేష్‌ బాబు సినిమాలు ఎక్కువగా చూస్తున్నట్లుగా వెళ్లడైంది. అంతే కాకుండా మహేష్‌ బాబు సినిమాలు పంజాబ్‌ లో డబ్‌ చేయాలని కూడా అక్కడ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. పంజాబీ అమ్మాయిలు మరియు అబ్బాయిలు ప్రస్తుతం మహేష్‌ బాబు అంటే తెగ పడి చస్తున్నారట. మహేష్‌ బాబు ఇంకా ఏమైనా పాత సినిమాలు ఉంటే పంజాబీలో డబ్‌ చేసి విడుదల చేయాల్సిందిగా కొందరు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా కోరుతున్నారట. పంజాబీలో మహేష్‌ బాబు సినిమా మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎంతో ఆసక్తిగా వారు అంతా ఎదురు చూస్తున్నారు.

ఉన్నట్లుండి మహేష్‌ కు ఇంత క్రేజ్‌ పంజాబీలో రావడం ఏంటా అంటూ అంతా కూడా అవాక్కవుతున్నారు. తెలుగు సినిమాలు ప్రత్యేకంగా పంజాబీలో ఎప్పుడు డబ్‌ కాలేదు. ప్రస్తుతం మహేష్‌ బాబు పంజాబీ క్రేజ్‌ చూస్తుంటే త్వరలోనే అక్కడి వారు మహేష్‌ బాబు సినిమాను పంజాబ్‌ లో డబ్‌ చేస్తారేమో అనిపిస్తోంది.