Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   3 Jan 2022 6:00 PM IST
ఎన్టీఆర్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ నెల 7న సంక్రాంతి కానుకగా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కావాల్సిన విష‌యం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా తాజాగా ప‌రిస్థితులు మారడం, ఒమిక్రాన్ , కోవిడ్ కేసులు ప్ర‌మాద క‌రంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఉత్త‌రాది రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూని విధించ‌డం మొద‌లుపెట్టారు. దీంతో `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ ని వాయిదా వేయ‌డం త‌ప్ప మేక‌ర్స్ కి మ‌రో ఆప్ష‌న్ క‌నిపించ‌లేదు. ఇది చాలా మందికి తీవ్ర నిరాశ‌ను క‌లిగించింది.

ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డ‌టానికి ముందు చిత్ర బృందం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ని జోరుగా చేసిన విష‌యం తెలిసిందే. ఉత్త‌రాదిలో మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం `ఆర్ ఆర్ ఆర్` టీమ్ వారం రోజుల పాటు అక్క‌డే తిష్ట‌వేసి సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ఏ ప్లాట్ ఫామ్ దొరికితే దాన్ని ఓ రేంజ్ లో వాడేశారు. ఇదే క్ర‌మంలో బాలీవుడ్ లో ఫేమ‌స్ షో గా పేరున్న `ది క‌పిల్ శ‌ర్మ షో`లోనూ పాల్గొన్నారు. ఈ షోలో రాజ‌మౌళి, రామ్ చ‌రణ్‌, ఎన్టీఆర్, అలియా భ‌ట్ పాల్గొన్నారు.

ఈ షోలో క‌పిల్ శ‌ర్మ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని ఓ రేంజ్ లో పొగిడేశాడు. `ఆంధ్రా వాలా` ఆడియో ఫంక్ష‌న్ ని, దానికి హాజ‌రైన ల‌క్ష‌లాది మందిని ఎన్టీఆర్ హ్యాండీల్ చేసిన విధానం గురించి గొప్ప‌గా అభివ‌ర్ణించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అన్న మాట‌లు వీక్ష‌కుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి వుండే ఎన్టీఆర్ తీరుకు ద‌క్షిణాది ఫ్యాన్స్ తో పాటు ఉత్త‌రాది వారు కూడా ఫిదా అయిపోతున్నారు. ఎన్టీఆర్ గొప్ప‌ద‌నానికి స్పెల్ బౌండ్ అవుతున్నారు.

న‌వ్వులు పూయిస్తూనే ఎన్టీఆర్ ఉత్త‌రాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. క‌పిల్ శ‌ర్మ షోకు సంబంధించిన ఎపిసోడ్ గ‌త ఆదివారం ప్ర‌సార‌మైంది. ఈ షోలో రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్ పాల్గొన్నారు. ఈ షో టెలివిజ‌న్ లో హ్యూజ్ హిట్ కావ‌డ‌మే కాకుండా నెట్టింట కూడా ఎన్టీఆర్ కార‌ణంగా వైర‌ల్ అవుతూ ట్రెండింగ్ అవుతోంది. ఈ షోలో ఎన్టీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరుకు ముగ్ధులైన అభిమానులు, నెటిజ‌న్స్ ఆయ‌నపై నెట్టింట ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఎన్టీఆర్ క‌పిల్ శ‌ర్మ షోలో పాల్గొన్న స్క్రీన్ షాట్ ల‌ని షేర్ చేస్తూ `ఎన్టీఆర్ స్టీల్ ద షో` అంటూ ప్ర‌శంసిస్తున్నారు. అంతే కాకుండా ఆయ‌న‌లో ఎంతో విన‌య‌పూర్వ‌క‌మైన నిజాయితీతో కూడిన వ్య‌క్తత్వం క‌నిపిస్తోంద‌ని, అభివ‌ర్ణిస్తున్నారు. ఇక క‌పిల్ శ‌ర్మ `ఆంధ్రా వాలా` ఈవెంట్ గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడు ఎన్టీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరుని చూసి ఇత‌నేనా ల‌క్ష‌లాది మంది అభిమానుల్ని త‌న మాట‌ల‌తో కంట్రోల్ చేసింద‌ని ఆశ్చంవేసింద‌ని చెబుతున్నారు.

నిమ్మ‌కూరులో 2003 డిసెంబ‌ర్ 5న జరిగిన `ఆంధ్రా వాలా` ఆడియో ఫంక్ష‌న్ లో 9 నుంచి 10ల‌క్ష‌ల మంధి అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పిలుపు మేర‌కు వివిధ ప్రాంతాల నుంచి రైళ్ల‌లో అభిమానులు భారీ సంఖ్య‌లో నిమ్మ‌కూరుకు చేరుకున్న విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇదే ఎన్టీఆర్ రాజ‌కీయ తెరంగేట్రానికి పునాదిగా మార‌నుందా? అని అంతా అప్ప‌ట్లో చర్చించుకున్నారు కూడా.