Begin typing your search above and press return to search.

గాసిప్ వీరులను మించిపోతున్న ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   19 Nov 2015 1:30 AM GMT
గాసిప్ వీరులను మించిపోతున్న ఫ్యాన్స్
X
సినీ ఇండస్ట్రీపై వచ్చినన్ని గాసిప్పులు వేరే ఎక్కడా ఉండవనడంలో ఆశ్యర్యం లేదు. ఓ వర్గం మీడియా అయితే, ఇలా గాసిప్స్ - రూమర్స్ ప్రచారం చేస్తూ బతికేస్తుంటుంది. ఇలాంటి ఫేక్ వార్తల ప్రచారంలో కొంతమంది ఆరితేరిపోయి ఉంటారు. వీళ్లని మించిపోతున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు. వీళ్లకి సోషల్ మీడియా తోడయ్యే సరికి.. రూమర్ల వేగం మరింతగా పెరిగిపోతోంది.

ఆ మధ్య ప్రభాస్ పెళ్లి ఫిక్సయిందంటూ ఓ వార్త బయల్దేరింది. భీమవరంకు చెందిన ఓ అమ్మాయిని ప్రభాస్ లైఫ్ పార్ట్ నర్ గా డిసైడ్ చేశారంటూ ఓ మేగజైన్ లో ఫోటోతో సహా వేసేశారు. అంతే ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చేసింది. కొంతమంది ఔత్సాహికులైతే.. ప్రభాస్, ఆ అమ్మాయి ఫోటోలను ఫోటోషాప్ లో మిక్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. అంతే అక్కడి నుంచి ఇది వైరల్ గా పాకిపోయింది. ఈ హడావిడి దెబ్బకు కృష్ణంరాజు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభాస్ మ్యారేజ్ ఇంకా సెట్ కాలేదని ప్రకటించాల్సి వచ్చింది.

ఇప్పుడిలాంటి రూమర్స్ అక్కినేని వారసుడి గురించి మొదలయ్యాయి. నాగార్జున త్వరలో నాగచైతన్య పెళ్లి వార్తను ప్రకటించనున్నారన్నది వాటి సారాంశం. ఓ ఫేమస్ హీరోయిన్ అని చెప్పేసుకుంటున్నారు. న్యూస్ కంటే ఫాస్ట్ గా ఈ ఫ్యాన్స్ అభిమానం పాకిపోతోంది. ఇది ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోందంటే.. ఇప్పడు నాగ్ స్వయంగా రంగంలోకి దిగక తప్పేట్లు లేదు. ఏమైనా.. గాసిప్పుల ప్రచారంలో మీడియాను సైతం మించిపోయారు ఫ్యాన్స్.