Begin typing your search above and press return to search.

ఎవరు ఊహించని పాత్రలో బాలయ్య మెప్పిస్తాడా..?

By:  Tupaki Desk   |   13 Jun 2020 10:30 AM GMT
ఎవరు ఊహించని పాత్రలో బాలయ్య మెప్పిస్తాడా..?
X
టాలీవుడ్ లో గత కొంతకాలంగా నటసింహం బాలకృష్ణ అభిమానులను వరుస ప్లాప్ సినిమాలతో నిరాశపరుస్తున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మరియు రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కట్టాయి. ఇప్పుడు బాలకృష్ణకి హిట్టు తప్పనిసరి అయిపొయింది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ సినిమాలు మంచి విజయం సాధించటంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బాలయ్య పుట్టినరోజున విడుదల చేసిన టీజర్ కి రెస్పాన్స్ ఆడిపోయింది. టీజర్ చూసిన ప్రతీ ఒక్కరు బాలయ్య ఈసారి రికార్డు బద్దలు కొట్టడం పక్కా అంటున్నారు.


టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి బాలయ్య బోయపాటిలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బిబి3 టీజర్ చూసాక ఖచ్చితంగా సింహ, లెజెండ్ లను మించిన హిట్ కొడతారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి అఘోర పాత్ర అని సమాచారం. అఘోర పాత్ర ఈ సినిమాలో కొంత నిడివి ఉంటుందని ఇప్పటికే బోయపాటి చెప్పాడు. అసలు బాలయ్యను ఎవరు ఊహించని అఘోర పాత్రలో చూపిస్తా అంటున్నాడు బోయపాటి. మరి బాలయ్య అఘోరగా మారడానికి గల కారణాలు ఏంటి.. అసలు కథనం ఏంటని ప్రేక్షకులలో ఆసక్తితో పాటు సందేహాలు నెలకొంటున్నాయి. అంతేగాక అఘోర పాత్ర అందరూ మెచ్చేలా ఉంటుందని బోయపాటి అనడంతో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ ఫ్రీగా ఉంటున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.