Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అల్లూరి.. భీమ్ పై ఫ్యాన్‌ ప్రేమ

By:  Tupaki Desk   |   14 Jun 2022 5:32 AM GMT
పిక్ టాక్ : అల్లూరి.. భీమ్ పై ఫ్యాన్‌ ప్రేమ
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో రామ్‌ చరణ్ అల్లూరి సీతారామరాజుగా మరియు ఎన్టీఆర్‌ కొమురం భీమ్ గా కనిపించిన విషయం తెల్సిందే.

వారిద్దరు అభిమానులు సినిమా ను ఆకాశమే హద్దు అన్నట్లుగా సక్సెస్ చేశారు. సినిమా విడుదల అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా భీమ్ మరియు అల్లూరి గురించిన చర్చ జరుగుతూనే ఉంది.

తాజాగా అల్లురి సీతారామ రాజు మరియు కొమురం భీమ్ పాత్రలపై ఒక అభిమాని తన అభిమానంను చాటుకున్నాడు. చాలా క్రియేటివ్‌ గా ఇద్దరు స్నేహితులుగా అల్లూరి మరియు కొమురం భీమ్ లను తన ఆర్ట్‌ తో అభిమానులకు కన్నుల విందు చేశాడు. ఇద్దరు కూడా నాటు నాటు పాటలో కనిపించే కాస్ట్యూమ్స్ లో ఈ ఆర్ట్‌ లో మనకు కనిపిస్తున్నారు. సినిమాలో వీరిద్దరిని కలిపి చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది.

సినిమా గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అయినా కూడా అభిమానులు మాత్రం కంటిన్యూస్ గా ఆ సినిమా తాలూకు మెమోరీస్ ను నెమరవేసుకుంటున్నారు. అల్లూరి మరియు కొమురం భీమ్‌ లకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా షేర్ అయిన ఈ ఆర్ట్‌ ను అభిమానులు తెగ వైరల్‌ చేస్తున్నారు. దాంతో చిత్ర యూనిట్ అఫిషియల్‌ సోషల్ మీడియా టీమ్‌ ఈ ఆర్ట్‌ ను ఇన్ స్టా లో షేర్ చేసి మరింత మందికి చేరువ అయ్యేలా చేశారు. అందరిని కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ప్రముఖంగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ల స్నేహం గురించి ఎంతగా చెప్పుకున్నా తక్కువే. సినిమా లో వారిద్దరి స్నేహం చాలా బాగుంది. ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క జీవితాల్లో ముఖ్య సంఘటనలను ఈ సినిమాలో కల్పించి చూపించడం గొప్ప విషయం అంటూ జక్కన్న పై ప్రశంసలు కురిపిస్తున్నారు.