Begin typing your search above and press return to search.
మహేష్ మాస్ అండ్ క్లాస్ ఫ్యాన్స్ కి పండగే
By: Tupaki Desk | 29 March 2023 12:00 PMసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ ను కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ స్టిల్ అభిమానుల అంచనాలను పెంచేస్తోంది. ఈ రేంజ్ లో మహేష్ బాబు ను మాస్ గా చూసి చాలా సంవత్సరాలు అయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అతడు.. ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబో సినిమా కోసం ఫ్యాన్స్ ప్రేక్షకులు పుష్కర కాలంగా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని మెప్పించే విధంగా సినిమాను రూపొందించే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువగానే హోం వర్క్ చేసి త్రివిక్రమ్ బరిలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా విడుదల చేసిన స్టిల్ చూస్తూ ఉంటే మాస్ ఫ్యాన్స్ కి పండగే అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరో వైపు సినిమా యొక్క స్టోరీ మరియు ఇతర ఎలిమెంట్స్ లో క్లాస్ ఆడియన్స్ కు నచ్చేవి చాలా ఉంటాయని అంటున్నారు.
ఈ సినిమా క్లాస్ మరియు మాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందని.. కన్నలు విందుగా మహేష్ బాబు ఫ్యాన్స్ కు కనిపించబోతున్నాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీలీల నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ తో పాటు ఇంకా ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఈ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి విడుదల తేదీని ఫిక్స్ చేశారు కనుక టీజర్ కోసం కనీసం దసరా వరకు అయినా వెయిట్ చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.