Begin typing your search above and press return to search.

బాబోయ్‌ మహేష్‌ 27 ఇన్ని పుకార్లా?

By:  Tupaki Desk   |   27 Feb 2020 8:30 AM GMT
బాబోయ్‌ మహేష్‌ 27 ఇన్ని పుకార్లా?
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 27వ చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని ఆరు నెలలుగా ప్రచారం జరుగింది. త్వరలో వీరి కాంబో మూవీ పట్టాలు ఎక్కబోతుంది అంటూ అంతా ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా మహేష్‌ అతడితో సినిమాను క్యాన్సిల్‌ చేశాడని వార్తలు వచ్చాయి. అది మొదలు మహేష్‌ 27వ చిత్ర దర్శకుడు అంటూ దాదాపుగా పది మంది పేర్లు వార్తల్లోకి వచ్చాయి.

వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్‌ అవ్వడమే ఆలస్యం వెంటనే పరశురామ్‌ పేరు ప్రచారం జరిగింది. కాని ఆయన నాగచైతన్య తో నాగేశ్వరరావు సినిమాను చేస్తున్న కారణంగా కాస్త కష్టంగా ఉందని మరికొందరి దర్శకుల పేర్లు పరిశీలకు వచ్చాయి. మహేష్‌ 27 జాబితా లో సందీప్‌ రెడ్డి నుండి మొదలుకుని మోహనకృష్ణ ఇంద్రగంటి వరకు పలువురి పేర్లు మీడియాలో వినిపించాయి.. కనిపించాయి. కాని ఏది ఇప్పటి వరకు నిజమైన వార్త అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.

మహేష్‌ బాబు వెంటనే మరో సినిమాను చేయాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇదే ఏడాదిలో ఆ సినిమా విడుదల చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంత స్పీడ్‌ గా సినిమా చేసేది ఎవరో వారిని పట్టుకోవాలని మహేష్‌ పీఆర్‌ టీం ప్రయత్నాలు చేస్తుందట. అందుకోసమే ఇంద్రగంటికి కూడా కథ చెప్పే ఛాన్స్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. మరి ఇంద్రగంటి స్టోరీకి మహేష్‌ ఇంప్రెస్‌ అవుతాడో లేదో అనేది చూడాలి. మార్చి నెలలో మహేష్‌ బాబు 27వ చిత్రం అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.