Begin typing your search above and press return to search.

కిల్ల‌ర్ లుక్ తో కిల్ చేస్తున్న న‌భా

By:  Tupaki Desk   |   25 Dec 2021 12:37 PM GMT
కిల్ల‌ర్ లుక్ తో కిల్ చేస్తున్న న‌భా
X
'ఇస్మార్ట్ శంక‌ర్' బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యంతో న‌భా రేంజే మారిపోయింది. కెరీర్ ప‌రంగా జోష్ అమాంతం పెరిగింది. సుధీర్ బాబు హీరోగా తెర‌కెక్కిన `న‌న్ను దోచుకుందువ‌టే` సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ క‌న్న‌డ బ్యూటీ ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు అందుకున్నా కానీ త‌నదైన గ‌ట్సీ పెర్ఫామెన్స్ తో క‌ట్టి పడేసింది ఇస్మార్ట్ శంక‌ర్ తోనే. పూరి ఇచ్చిన ఇస్మార్ట్ స‌క్సెస్ అవకాశాల‌కు బాట వేసింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా నాలుగైదు సినిమాల్లో న‌టించింది. కానీ ఆవేవి అమ్మ‌డికి క‌లిసి రాలేదు. `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` సినిమా యావ‌రేజ్ గా ఆడినా కెరీర్ స్పీడ్ అందుకోలేదు. అల్లుడు అదుర్స్.. మ్యాస్ట్రో లాంటి చిత్రాలు ఫ్లాపుల‌వ్వ‌డం బిగ్ మైన‌స్ గా మారింది.

న‌భాకి కొంత రేంజు వ‌చ్చేశాక పారితోషికం పెంచేసింద‌న్న‌ గుస‌గుస వినిపించింది. ఆ కార‌ణంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లతో స‌రిప‌డ‌లేద‌ని ప్ర‌చారం సాగింది. అయితే ఇటీవ‌ల నభా మ్యాజిక్ ఇన్ స్టా మాధ్య‌మంగా బాగానే వ‌ర్క‌వుట‌వుతోంది. ప్ర‌చారం ప‌రంగా నభా స‌రికొత్త ఒర‌వ‌డితో దూసుకుపోతోంది. ఇన్ స్టాలో ఫాలోవ‌ర్స్ ని వీడ‌క నిరంత‌రం ట‌చ్ లోనే ఉంది. కొత్త ఫోటో షూట్ల‌లో పాల్గొంటూ అటెన్ష‌న్ డ్రా చేస్తోంది.

తాజాగా న‌భా ఇన్ స్టాలో షేర్ చేసిన కొత్త ఫోటోషూట్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. టాప్ టు బాట‌మ్ డిజైనర్ లుక్ లో క‌నిపించింది ఈ బ్యూటీ. బ‌ట‌న్ లెస్ టాప్ కి బాట‌మ్ లో మ్యాచింగ్ డెనిమ్స్ షార్ట్ ధ‌రించి టోన్డ్ లుక్‌ తో క‌ట్టిప‌డేస్తోంది. ఈ కొత్త‌ లుక్ లో న‌భా మిల‌మిలా మెరుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. అభిమానుల హాట్ కామెంట్ల‌తో మ‌రింత హీటెక్కిస్తున్నారు. అన్న‌ట్టు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంద‌ని ప్ర‌చార‌మైంది. కానీ దానికి సంబంధించిన స‌రైన అప్ డేట్ రాలేదు.