Begin typing your search above and press return to search.

యష్ బర్త్ డే నాడు 'కేజీఎఫ్‌ 2' సర్‌ ఫ్రైజ్‌ రానుందా..?

By:  Tupaki Desk   |   3 Dec 2020 1:15 PM IST
యష్ బర్త్ డే నాడు కేజీఎఫ్‌ 2 సర్‌ ఫ్రైజ్‌ రానుందా..?
X
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'కేజీఎఫ్‌ 2' ఒకటని చెప్పవచ్చు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ - దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 'కేజీఎఫ్‌' మొదటి చాప్టర్ భారీ విజయం సాధించడంతో దానికి కొనసాగింపుగా వస్తున్న చాప్టర్ 2 పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. దీనికి తగ్గట్టే 'కేజీఎఫ్ 2' ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. స్వల్ప విరామం తరువాత హైదరాబాద్ లో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరో యష్ - ప్రతినాయకుడు సంజయ్ దత్ పాల్గొనే ఈ షెడ్యూల్ ని డిసెంబర్‌ చివరికల్లా పూర్తి చేస్తారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

కోలార్ ఫీల్డ్ గ‌నుల నేపథ్యంలో తెరకెక్కుతున్న 'కేజీఎఫ్‌ 2' నుంచి త్వరలోనే ఓ సర్‌ఫ్రైజ్‌ రాబోతుందట. జనవరి 8న తేదీన రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అదే రోజు సినిమా విడుదలకు సంబంధించిన వి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే యష్ బర్త్‌ డే నాడు అభిమానులకు ఫీస్ట్‌ అందినట్లేనని చెప్పవచ్చు. కాగా, 'కేజీఎఫ్' సినిమాలో మిగిలిపోయిన ప్రశ్నలకు 'కేజీఎఫ్ 2' లో సమాధానం లభించనుంది. ఆధిపత్యం కోసం రాకీ భాయ్ - అధీరా ల భీకరమైన పోరును ఇందులో చూపించబోతున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవీ బాస్రుర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'కేజీఎఫ్ 2' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.