Begin typing your search above and press return to search.

రెండు నిమిషాలకే ఇంత చేస్తే రెండున్నర గంటలకు ఇంకెంత చేస్తారో?

By:  Tupaki Desk   |   30 March 2021 12:30 PM GMT
రెండు నిమిషాలకే ఇంత చేస్తే రెండున్నర గంటలకు ఇంకెంత చేస్తారో?
X
మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ ట్రైలర్స్‌ ను థియేటర్లలో ప్రదర్శించడం మనం కామన్ గా చూస్తూ వస్తున్నాం. గతంలో బాహుబలి ట్రైలర్ ను థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించిన సమయంలో అభిమానులు ఏ రేంజ్ లో సందడి చేశారో తెలిసిందే. ఇక నిన్న వకీల్ సాబ్ ట్రైలర్‌ ను కూడా థియేటర్లలో విడుదల చేసి సందడి చేశారు. మేకర్స్‌ ఊహించని తీరులో థియేటర్లలో స్పందన దక్కింది. అభిమానులు కొత్త సినిమా రిలీజ్ అయిన సమయంలో చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అలా ఈ టీజర్ కు సందడి చేశారు. పాలాభిషేకాలు.. కటౌట్ లు ప్లెక్సీలు ఇలా రెండు నిమిషాల ట్రైలర్ కోసం రచ్చ రచ్చ చేశారు.

కేవలం ట్రైలర్‌ థియేటర్‌ లో రిలీజ్ అయితేనే ఈ రేంజ్ లో సందడి చేసిన అభిమానులు ఏప్రిల్‌ 9వ తారీకున సినిమా థియేటర్లలో రానున్న నేపథ్యంలో మరెంత రచ్చ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొనడం ఖాయం. థియేటర్లలో అభిమానులకు పూనకాలే అంటున్నారు. పవన్ మూడు సంవత్సరాల తర్వాత వకీల్‌ సాబ్‌ తో రాబోతున్న నేపథ్యంలో సినిమాపై పీక్స్ లో అంచనాలు ఉన్నాయి. మిడ్‌ నైట్‌ షో లు బెనిఫిట్ షో లు ఇలా మొదటి మూడు రోజుల పాటు అయిదు ఆరు షో లు వేసేందుకు అనుమతులు తీసుకున్నారు. కనుక అభిమానుల సందడి ఇలాగే కొనసాగి సినిమా కు పాజిటివ్ టాక్‌ వస్తే రికార్డు బ్రేకింగ్‌ ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు. ఏప్రిల్‌ 9న థియేటర్ల వద్ద ఉండే సందడి కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.