Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా స్టార్స్ తో మల్టీస్టారర్ చేయమని కోరుతున్న ఫ్యాన్స్..!
By: Tupaki Desk | 16 Jan 2021 4:36 PM IST'బాహుబలి' సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. 'కేజీఎఫ్' సినిమాతో కన్నడ రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాన్ ఇండియా స్టార్స్ ఇద్దరూ కలిసి ఒకేచోట కనిపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్.. ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని చేయనున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న ఈ సినిమాని నిన్న శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యశ్ అతిథిగా హాజరయ్యారు.
'సలార్' ప్రారంభోత్సవంలో ప్రభాస్ - యష్ కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా హీరోలిద్దరినీ ఒకే ఫొటోలో చూసిన అభిమానులు ఇద్దరి కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. వీరిద్దరినీ కలిపి ప్రశాంత్ నీల్ ఓ సినిమా ప్లాన్ చేయాలని కోరుతున్నారు. ఇదే కనుక జరిగితే బాక్సాఫీస్ బద్దలవుతుందని చెప్పవచ్చు. ఫ్యూచర్ లో ఈ పాన్ ఇండియా హీరోల మల్టీస్టారర్ సాధ్యపడుతుందేమో చూడాలి. ఇదిలా ఉండగా ప్రభాస్ ఈ ఏడాది 'రాధే శ్యామ్' సినిమాతో పాటు 'సలార్' చిత్రాన్ని కూడా పూర్తి చేయనున్నాడు. మరోవైపు యష్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.