Begin typing your search above and press return to search.

కరోనాను మర్చిపోయి హీరోను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   13 Aug 2020 3:30 AM GMT
కరోనాను మర్చిపోయి హీరోను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్‌
X
కరోనా కారణంగా స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోలు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కూడా బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కరోనా మహమ్మారి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉంది. కనుక ఏమాత్రం సాహసం చేయవద్దనే ఉద్దేశ్యంతో కనీసం బయటకు కూడా వెళ్లడం లేదు. అయితే బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ మాత్రం తన సినిమాను పూర్తి చేసే ఉద్దేశ్యంతో టర్కీలో షూటింగ్‌ కు వెళ్లాడు. అక్కడ షూటింగ్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సమయంలో మాస్క్‌ ధరించిన అమీర్‌ రోడ్డుపై అలా షికారు చేస్తూ ఉండగా అక్కడ కూడా ఆయన్ను గుర్తు పట్టారు.

టర్కీలో కూడా ఆయన్ను చూసిన అభిమానులు ఒక్కసారిగా మీద పడ్డారు. ఆయన అభిమానులను కాదనలేక వారితో సెల్ఫీ లు దిగి వారిని ఆంనంద పర్చాడు. కరోనా విషయాన్ని మర్చిపోయిన వారు అమీర్‌ తో సెల్ఫీలకు రెడీ అయ్యారు. అమీర్‌ ఖాన్‌ ఊహించని పరిణామం అవ్వడంతో ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండి పోయాడు. లేడీ ఫ్యాన్స్‌ తో పాటు జెంట్స్‌ కూడా చాలా మంది అమీర్‌ తో ఫొటో దిగేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అమీర్‌ సెక్యూరిటీ మెల్లగా ఆయన్ను అక్కడ నుండి తీసుకు వెళ్లగలిగారు. ఇలాంటి సమయంలో అభిమానులు ఇలా మీద పడితే చాలా ప్రమాదం. అమీర్‌ ఇకపై అయినా జాగ్రత్తగా ఉండాలి.