Begin typing your search above and press return to search.
పవన్ బర్త్ డే అప్డేట్స్ తో ఫ్యాన్స్ హ్యాపీగా లేరా..?
By: Tupaki Desk | 3 Sept 2021 8:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. 'వకీల్ సాబ్' తో రీ ఎంట్రీ ఇచ్చిన జనసేనాని బర్త్ డేని ఎప్పుడూ లేనంత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలతో పాటుగా పవన్ ప్రస్తుతం నటిస్తున్న నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో సోషల్ మీడియా హోరెత్తింది.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ''భీమ్లా నాయక్'' చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'భీం భం భీం భీం భీమ్లానాయక్' అంటూ వచ్చిన ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇది మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇక క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో చేస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఇదే క్రమంలో సురేందర్ రెడ్డి తో చేస్తున్న సినిమా నుంచి కొత్త పోస్టర్.. హరీష్ శంకర్ #PSPK28 ప్రీ లుక్ పోస్టర్స్ ని కూడా వదిలారు.
పవన్ నటిస్తున్న నాలుగు సినిమాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నా.. పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ అప్డేట్స్ పట్ల హ్యాపీగా లేరని తెలుస్తోంది. ఈ విషయాన్ని పీకే ఫ్యాన్స్ ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లిమ్స్ కు థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ చూసి ఫస్ట్ సింగిల్ ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఉహించుకున్నారు. చిత్ర బృందం కూడా 63.4 అంటూ ఈ సాంగ్ పై హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు. అయితే టైటిల్ సాంగ్ విన్న తర్వాత కొంతమంది పవన్ ఫ్యాన్స్ పెదవి విరిచారు. ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల యావరేజ్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. సాకీ పాడిన మొగులయ్య - సాహిత్యం రాసిన రామజోగయ్య శాస్త్రి లను మాత్రం మెచ్చుకుంటున్నారు.
అలానే 'హరి హర వీరమల్లు' చిత్రం నుంచి సరికొత్త పోస్టర్ వస్తుందని అభిమానులు భావించారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా పూర్తైన సినిమా కావడంతో.. స్పెషల్ అప్డేట్ ఉంటుందని అనుకున్నారు. అయితే మేకర్స్ మాత్రం గతేడాది పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నే మళ్ళీ వదిలారు. కాకపోతే ఈసారి దాని మీద కొత్త విడుదల తేదీని ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చినందుకు ఓ వైపు సంతోషంగా ఉన్నా.. న్యూ పోస్టర్ లేనందుకు నిరాశ చెందుతున్నారు. దీని కోసమే టైమింగ్ ఇస్తూ ట్వీట్లు చేయడం అని కామెంట్స్ చేస్తున్నారు.
#PSPK28 ప్రీ లుక్ పోస్టర్ తో పవర్ స్టార్ అభిమానులు ఎక్కువ నిరాశ చెందినట్లు కామెంట్స్ ని బట్టి అర్థం అవుతోంది. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ - హరీష్ సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకే మిగతా సినిమాల కంటే ఈ ప్రాజెక్ట్ ని ఫ్యాన్స్ ప్రత్యేక దృష్టితో చూస్తుంటారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ తోనే నేషనల్ వైడ్ ట్రెండ్ చేశారనే ఈ మూవీపై క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రీ లుక్ లో పవన్ ముఖం చూపించకుండా ఓ బైక్ ని చూపించారని అంటున్నారు. దీని కోసమేనా 'జాతర షురూ' అంటూ ట్వీట్లు పెట్టింది అని పీకే ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రీ లుక్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్ డిజైన్స్ బెటర్ గా ఉన్నాయని ట్రోల్ చేస్తున్నారు.
అయితే పవన్ - సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కు సంబంధించిన పోస్టర్ మాత్రం వీటితో పోల్చుకుంటే కాస్త బెటర్ అని పవర్ స్టార్ అభిమానులు అంటున్నారు. 'యథా కాలమ్.. తథా వ్యవహారమ్' అంటూ ఒక వైపు హైదరాబాద్ నగరం మరోవైపు గన్ తో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సమకాలనీ అంశాలకు యాక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఈ పోస్టర్ సూచిస్తుంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకా టైం ఉండటం వల్ల అప్డేట్ గురించి ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. అందుకే పవన్ బర్త్ డే పోస్టర్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే ఎక్కువ అంచనాలు పెట్టుకున్న మిగతా అప్డేట్స్ మాత్రం నిరాశ చెందారని సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్స్ ని చూస్తే అర్థం అవుతోంది.