Begin typing your search above and press return to search.

ఆ హీరో.. 'విజయ్'తో మరో రెబల్ తీస్తాడా.. ఏంటి?

By:  Tupaki Desk   |   11 May 2020 12:10 PM GMT
ఆ హీరో.. విజయ్తో మరో రెబల్ తీస్తాడా.. ఏంటి?
X
సినీ ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో స్టార్స్ అయిన వాళ్లలో కొరియోగ్రాఫర్ లారెన్స్ ఒకరు. ఎన్నో వందల సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ గా మారాడు. నాగార్జున హీరోగా తెరకెక్కిన మాస్ సినిమాతో దర్శకుడిగా మారిన లారెన్స్ ఆ తర్వాత ముని, స్టైల్, డాన్, కాంచన, రెబెల్, గంగ, కాంచన3 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఎక్కువగా స్వీయ దర్శకత్వంలో నటిస్తూ సినిమాలు తీసే లారెన్స్ బయట హీరోలతో ఎక్కువగా తీయలేదు. అయితే నాగార్జునతో మాస్, డాన్ సినిమాలతో హిట్స్ అందుకున్న లారెన్స్.. ప్రభాస్ తో తీసిన 'రెబల్' సినిమాతో అట్టర్ ప్లాప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ సినిమా వరుస హిట్లలో ఉన్న ప్రభాస్ కి కూడా చాలా పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పాలి.

ఆ పరాజయంతో లారెన్స్ మళ్లీ తన స్వీయ దర్శకత్వంలో ముని సిరీస్ తీసుకుంటూ వస్తున్నాడు. అయితే స్టార్స్ తో మాత్రం లారెన్స్ హిట్ కొట్టలేడనే భావన అందరిలో ఉంది. కేవలం హారర్ జోనర్లో మాత్రమే ఆయన సక్సెస్ అవుతున్నాడు. ఇక మాస్, డాన్ స్టోరీస్ మిక్స్ చేసి తీసిన రెబల్ ప్రభాస్ కెరీర్లో ఇప్పటికి చెరగని మచ్చలా మిగిలిపోయింది. ఇక ఇటీవలే తన ఫేవరెట్ హీరో తలైవాతో సినిమా తీస్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు ఇళయదళపతి విజయ్. ప్రస్తుతం మాస్టర్ సినిమాతో బిజీ ఉన్న విజయ్.. తర్వాత ఏఆర్ మురగదాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత లారెన్స్ తో చేస్తాడని టాక్.

అలాగే లారెన్స్ కూడా హిందీ లక్ష్మిబాంబ్ సినిమాతో బిజీ ఉన్నాడు. అది అయిపోతే విజయ్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తాడని సమాచారం. అయితే బయట హీరోలతో ఎక్కువ డాన్ టైప్ సినిమాలు తీసే లారెన్స్ ఈ టాప్ హీరోతో కూడా అలాంటి ప్లాన్ చేస్తున్నాడేమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఎందుకంటే మాస్ పెద్ద హిట్, డాన్ యావరేజ్ హిట్, రెబల్ ప్లాప్.. మూడు ఒకే జోనర్ లో తీసాడు. ఇక విజయ్ తో కూడా అలాంటి ప్లాన్ చేస్తే అది మరో రెబల్ అవుతుందేమో అని ఫ్యాన్స్ అభిప్రాయం. చూడాలి మరి ఈ కాంబినేషన్ నిజమైతే.. ఫ్యాన్స్ లో మాత్రం భయం పక్కా.. అంటున్నాయి సినీ వర్గాలు.