Begin typing your search above and press return to search.

ఫేవ‌రెట్ హీరో మిస్సింగ్ పై ఫ్యాన్స్ ఆవేద‌న‌

By:  Tupaki Desk   |   21 Jan 2022 3:00 AM GMT
ఫేవ‌రెట్ హీరో మిస్సింగ్ పై ఫ్యాన్స్ ఆవేద‌న‌
X
ప్రియాతి ప్రియమైన అభిమాన‌ సైన్యం షారుఖ్ ఖాన్ ను `బాలీవుడ్ కింగ్‌` అని పిలుస్తారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ ని అంతగా ఆకట్టుకుంటుంది. రొమాన్స్ అంటే ఏంటో.. సిస‌లైన ఎంటర్ టైన్ మెంట్ అంటే ఏంటో మీనింగ్ చెప్పిన గురుడు కింగ్ ఖాన్. అత‌డి శైలి మహిళలను ఆకర్షిస్తుంది. అయితే బాద్షా చాలా కాలంగా గ్లామర్ ప్రపంచం నుండి యాక్షన్ కు దూరమయ్యాడు. అతని చివరి చిత్రం జీరో 2018 సంవత్సరంలో విడుదలైంది. గత సంవత్సరం అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు జరిగినప్పటి నుండి అతను ట్విట్టర్ లో తన అభిమానులతో ఇంటరాక్ట్ కాలేదు. గురువారం సాయంత్రం అతని అభిమానులు సోషల్ మీడియాలో తమ భావాలను వ్యక్తం చేశారు.

వి మిస్ యు SRK అంటూ ట్రెండ్ చేశారు. అభిమానులు తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ట్విట్టర్ లోకి వెళ్లారు. షారూఖ్ ఖాన్ నుండి రిలీజ్ కి సంబంధించిన శుభ‌వార్త‌ వినడానికి ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారు హ్యాష్ ట్యాగ్ ల‌లో ‘వి మిస్ యూ SRK’ ట్రెండింగ్ అవుతోంది. SRK పాత ఫోటోలు వీడియోలు బెస్ట్ మెమరీస్ ను ట్వీట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ త‌మ‌దైన మార్క్ AskSRK ని ట్విట్టర్ లో నిర్వహించమని షారుఖ్ ను అభ్యర్థించారు. ఇది ప్రాథమికంగా ప్రశ్న-జవాబుల‌ థ్రెడ్. ఒక అభిమాని ట్వీట్ చేస్తూ 4 నెలలు అయ్యింది #WeMissYouSRK.. అతను త్వరలో తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను అంటూ ఆవేద‌న చెంద‌గా.. మరొక అభిమాని ఇలా వ్రాశాడు, ``బాలీవుడ్ మీరు లేకుండా బాలీవుడ్ కాదు`` అని వ్యాఖ్యానించారు.

SRK కుమారుడు ఆర్యన్ ఖాన్ గత సంవత్సరం ముంబైలో క్రూయిజ్ డ్ర‌గ్స్ కేసులో అరెస్టయ్యాడు. అతను అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ ఆర్థర్ రోడ్ జైలులో ఒక నెల గడిపారు. షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటి నుండి SRK ఎటువంటి బహిరంగ ట్వీట్లు చేయలేదు. అయితే ట్విట్ట‌ర్ లో ఫ్యాన్స్ ని సంతుష్టుల‌ను చేసేందుకు ట‌చ్ లోకి వ‌స్తార‌ని ఆశిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. షారుఖ్ ఖాన్ తదుప‌రి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న‌ `పఠాన్` చిత్రంలో కనిపించనున్నారు. అతను అట్లీ తో ఓ చిత్రానికి ప‌ని చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3లో అతిథి పాత్రలో క‌నిపించ‌నున్నారు.