Begin typing your search above and press return to search.

హీరోయిన్ ని ముద్దాడి ల‌ట‌క్కున జంప్

By:  Tupaki Desk   |   13 Jan 2020 10:16 AM GMT
హీరోయిన్ ని ముద్దాడి ల‌ట‌క్కున జంప్
X
అభిమానం హ‌ద్దు మీరితే ప‌రిణామం ఎలా ఉంటుందో ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం. బాలీవుడ్ అందాల క‌థానాయిక సారా అలీఖాన్ కి ఉన్న పిచ్చి ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఈ అమ్మ‌డు క‌నిపించిందంటే చాలు వీధుల‌న్నీ జామ్ అయిపోతున్నాయి. జిమ్ కి వెళ్లినా.. మార్కెట్ కి వెళ్లినా.. ప‌బ్లిక్ లోకి ఎక్క‌డికి వెళ్లినా జ‌నం గుంపులు గుంపులుగా గుమిగూడి ప‌రేషాన్ అయిపోతున్నారు. న‌టించింది రెండు సినిమాలే అయినా సారాకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే స్టార్ హీరోయిన్ రేంజుకు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. సైఫ్ అలీఖాన్ వార‌సురాలిగా సారా కెరీర్ ఆరంభ‌మే జెట్ స్పీడ్ అందుకుంది.

ఇటీవ‌లే ఈ భామ‌ మాల్దీవుల విహారం పూర్తి చేసుకుని తిరిగి ముంబైకి చేరుకుంది. సారా ట్రిప్ కు సంబంధించిన ఫొటోల్ని సోష‌ల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. టూర్‌ని ముగించుకుని తిరిగి ముంబై చేరుకున్న సారా డైలీ వ‌ర్క‌వుట్స్ కోసం జిమ్‌కి వెళ్లింది. ఆ క్ర‌మంలోనే ఊహించ‌ని ఓ ఘ‌ట‌న నిశ్చేష్టురాలినే చేసింది.