Begin typing your search above and press return to search.

ఫ్యాన్ మేడ్ పోస్టర్: ఛత్రపతి శివాజీగా యంగ్ టైగర్..!

By:  Tupaki Desk   |   24 March 2021 2:30 AM GMT
ఫ్యాన్ మేడ్ పోస్టర్: ఛత్రపతి శివాజీగా యంగ్ టైగర్..!
X
నందమూరి తారక రామారావు మరియు బాలకృష్ణ ఇద్దరూ పౌరాణిక చారిత్రక సాంఘిక జానపద చిత్రాల్లో నటించి అభిమానులను అలరించారు. ఈ క్రమంలో తర్వాతి జెనరేషన్ లో వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే అలాంటి పాత్రలు పోషించగలరని నందమూరి ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతారు. దీనికి తగ్గట్టే 'యమదొంగ' సినిమాలో యముడి గెటల్ లో ఎన్టీఆర్ చూపించిన అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే తారక్ చారిత్రక పౌరాణిక పాత్రలు పోషించాలని అభిమానులు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ ఛత్రపతి శివాజీ గెటప్ లో ఉన్న ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీగా ఎన్టీఆర్ ని చూడాలని ఆశపడిన ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం ఓ అభిమాని ఈ పోస్టర్ ని డిజైన్ చేసాడు. 'ఎవరు మీలో కోటీశ్వరుడు' ఫ్రెష్ మీట్ లో భాగంగా ఎన్టీఆర్ ఫోటోనో తీసుకుని గ్రేట్ శివాజీ గా మార్చారు. ఛత్రపతిగా మారిన తారక్ స్టన్నింగ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి పాత్రలో చేతిలో కత్తి పట్టుకుని ఎన్టీఆర్ కదనరంగంలోకి దిగితే చూడాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గా ఈ పోస్టర్ ని డిజైన్ చేసిన అభిమానులను అభినందించాల్సిందే.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా రానున్న ఈ చిత్రంలో తెలంగాణ విప్లవ వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. RRR దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చేయనున్నాడు తారక్.