Begin typing your search above and press return to search.

గుండెల్లో కొలువున్నావ్‌.. అక్కినేని హీరోపై అభిమాని ప్రేమ‌.. చైతూ ఎమోష‌న‌ల్‌!

By:  Tupaki Desk   |   8 March 2021 10:35 AM GMT
గుండెల్లో కొలువున్నావ్‌.. అక్కినేని హీరోపై అభిమాని ప్రేమ‌.. చైతూ ఎమోష‌న‌ల్‌!
X
హీరోల‌కు అభిమానులే ఇంధ‌నం.. వారు ఎంత స‌పోర్టు చేస్తే వారి స్టార్ డ‌మ్ అంత మైలేజ్ తో దూసుకుపోతుంది. పురుషులందు పుణ్య‌పురుషులు వేర‌యా అన్న‌ట్టు.. అభిమానులందు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ వేరుగా ఉంటారు. త‌మ హీరోకోసం వారు ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తారు. తాజాగా.. ఓ అభిమాని త‌న‌కోసం చేసిన ప‌నిచూసి చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు నాగ‌చైత‌న్య‌.

అక్కినేని వార‌సుడ‌గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చైతూ.. ఆ త‌ర్వాత త‌న‌దైన టాలెంట్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. ప్ర‌స్తుతం మ‌నం ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్లో 'థాంక్యూ' అనే చిత్రం చేస్తున్నాడు చైతూ. ఈ షూట్ ఓ నదీతీరంలో సాగుతుండగా.. తన హీరోను కలవడానికి ఓ అభిమాని ప్రయత్నించాడు. వీలుకాకపోయే సరికి.. ఏకంగా బ్రిడ్జిపై నదిలో దూకేశాడు. విషయం తెలుసుకున్న చైతూ.. అతన్ని పిలిచి మాట్లాడాడు.

ఇప్పుడు మ‌రో అభిమాని చూపించిన ప్రేమ‌కు ఎమోష‌న్ అయ్యాడు అక్కినేని హీరో. త‌ల్లిదండ్రులు లేని ఓ అభిమాని.. త‌న గుండెల‌పై ఏకంగా చైతూ ఫొటో ముద్రించుకున్నాడు. కింద 'చై అక్కినేని' అని ఇంగ్లీష్ లో రాయించుకున్నాడు. అంతేకాదు.. చేతులపై కూడా పచ్చపొడిపించుకున్నాడు.

ఇది చూసిన చైతూ.. ఎందుకురా ఇలా.. అని ప్ర‌శ్నించాడు. ఏ సినిమా చూసి ఇలా మారిపోయావ్ అని అడ‌గ్గా.. ''నేను సినిమాలు చూసి ఇలా మార‌లేదన్నా.. మీ క్యారెక్టర్ అంటే ఇష్టం'' అని చెప్పాడు. దీంతో.. ఎమోషన్ అయ్యాడు చైతూ. క్రమంగా.. తన ఖాతాలో హిట్లు వేసుకుంటూ పోతున్న నాగచైతన్య.. ఇప్పుడు అభిమానులను కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు.