Begin typing your search above and press return to search.

అన్నీ మంచి సినిమాలే.. మీ ఓటు దేనికి?

By:  Tupaki Desk   |   16 April 2016 11:11 AM IST
అన్నీ మంచి సినిమాలే.. మీ ఓటు దేనికి?
X
గతవారం ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ తీవ్రంగా నిరాశపరచడంతో సగటు సినీ ప్రియుడు బాధపడ్డాడు. ఊపిరి మినహా అంతకు ముందు విడుదలైన చిన్నా పెద్దా సినిమాలు కూడా పెద్దగా మెప్పించలేదు. ఒకవిధంగా సినీమా లవర్ కి సినిమా కరువు ఏర్పడింది.

అయితే ఒక్క వారంలోనే ఆ కరువంతా తీరిపోయింది. వివిధ వర్గాల ఆడియన్స్ ని మెప్పించే చిత్రాలు ఈ వారం విడుదలవడమేకాక అన్నీ మంచి టాక్ తెచ్చుకోవడం శుభసూచకం. చిన్నా పెద్దా తేడా లేకుండా బాష బేధంలేకుండా విడుదలైన జంగిల్ బుక్ రికార్డు కలెక్షన్లను సాధిస్తుంది. ఈ వారం భారీ ఎత్తున విడుదలైన షారుఖ్ ఫ్యాన్ సినిమాకూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

ఇక మన తెలుగు విషయానికి వస్తే డైరెక్ట్ ఫిలిమ్ గా రిలీజ్ అయిన ఆడోరకం.. ఈడోరకం కన్ఫ్యుజింగ్ కామెడితో ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తుంది. విజయ్ నటించిన డబ్బింగ్ సినిమా పోలీస్ మాస్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కాబట్టి ఈవారం మనకి కంటినిండా సినిమాలు.. థియేటర్లలో బాక్స్ నిండా కలెక్షన్లు అన్నమాట.