Begin typing your search above and press return to search.
ప్రభాస్ కు యోగా పాఠాలు చెప్పింది ఎవరో తెలుసా?
By: Tupaki Desk | 21 Jun 2020 8:00 PM ISTనేడు ప్రపంచ యోగా దినోత్సవం. ఈరోజు భారతదేశానికి పండుగ రోజు. ఎందుకంటే ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మనమే కాబట్టి ఈ వేడుకను ప్రధాని మోడీ దగ్గరుండి నిర్వహిస్తూ విశ్వవ్యాప్తం చేశారు. ఈ యోగా డే ను పురస్కరించుకొని ఒక కొత్త విషయం తెలిసింది. మన స్టార్ హీరో ప్రభాస్ యోగా చేస్తాడని.. ఆయనకు ఓ టీచర్ ఉందని.. ఆమె తన బెస్ట్ స్టూడెంట్ ప్రభాస్ అని కితాబివ్వడం విశేషం.
తాజాగా ప్రభాస్ ఒక వీడియోను యోగా డే సందర్భంగా ట్విట్టర్ లో పంచుకున్నారు. ప్రముఖ యోగా ట్రైనర్ రూహీ తన యోగా టీచర్ అని.. యోగా డేను పురస్కరించుకొని ఈ విషయం పంచుకున్నారు. ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. తన వృత్థిలో ఫలితాలు.. ఏకాగ్రత సాధించడానికి యోగా టీచర్ రూహీ సహకరించారో వివరించారు. తాను ఇంత ప్రశాంతంగా ఉండడానికి యోగా కారణమన్నారు.
ఇక ఈ యోగా టీచర్ గురించి ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. ఈ యోగా ట్రైనర్ రూహీ మరెవరో కాదు.. రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసే సెంథిల్ కుమార్ భార్యనే. ప్రముఖ యోగా టీచర్ అయిన ఆమె ప్రభాస్ కు యోగా నేర్పిస్తుంటారని తెలిసింది.