Begin typing your search above and press return to search.

రెండో పెళ్లి ప్ర‌చారంపై నిర్మాత భ‌గ భ‌గ‌

By:  Tupaki Desk   |   3 March 2020 10:25 AM IST
రెండో పెళ్లి ప్ర‌చారంపై నిర్మాత భ‌గ భ‌గ‌
X
ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి క్రేజీ ఎగ్జిబిట‌ర్ గా.. అగ్ర నిర్మాతగా ఎదిగిన ట్యాలెంట్ ఆయ‌నది. ఏడాదికి ఐదారు సినిమాలతో నిత్యం బిజీ. ఒడిదుడుకులు ఉన్నా త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. మొన్న‌నే ఓ బిగ్ ఫ్లాప్ అత‌డిని స‌తాయించింది. ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా మీడియా గ్లేర్ ఎప్పుడూ ఆయ‌న వెంటే ఉంటుంది. నిత్యం ఆయనకు సంబంధించిన ఏదో వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. వ‌రుస‌గా అగ్ర హీరోతో పాటు యువ‌హీరోల‌తోనూ సినిమాలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇటీవల ఆయన వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారానిక సంబంధించిన ఓ వార్త తెలుగు పరిశ్రమలో హాట్‌ టాపిక్ అయ్యింది.

ఆయన సీక్రెట్ గా రెండో పెళ్ళి చేసుకున్నార‌న్న‌దే ఆ వార్త సారాంశం. ఆయన భార్య రెండేళ్ల‌ క్రితం హఠాన్మరణం చెందారు. దీంతో ఇన్ని రోజులు ఒంటరిగానే ఉన్నారు. కానీ ఇటీవల బంధువుల్లోనే తెలిసిన ఓ 30 ఏళ్ల‌ అమ్మాయిని ఆయన రహస్యంగా.. కేవలం కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో దుబాయ్ లో పెళ్ళి చేసుకున్నారట. తన కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే ఆయన ఈ పెళ్ళి చేసుకున్నార‌ని గాసిప్పులు షికారు చేశాయి. గత కొన్ని రోజులుగా ఈ వార్త‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ విషయం తెలిసి సదరు నిర్మాత మీడియాపై ఫైర్‌ అవుతున్నారట. తనకు బాగా తెలిసిన వ్యక్తులే ఇలా రాయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే మీడియా వ్యక్తులు కనిపిస్తే పరోక్షంగా మండిపడుతున్నట్టు సమాచారం.

అంతేకాదు తన పెళ్ళికి సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు ఆయన పెళ్ళి ఈ మండే ఎండ‌ల్లోనే జరగబోతుందనే మరో వార్త కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి ఏది ఇందులో ఏది నిజం? ఏది అబ‌ద్ధం? అనేది ఆయ‌నే స్వ‌యంగా వెల్లడిస్తే గానీ క్లారిటీ గా తెలియదు. కొన్నిటికి అధికారికంగా చెక్ పెడితే కానీ అన‌వ‌స‌ర ప్ర‌చారం సాగ‌ద‌ని సూచిస్తున్నారు నెటిజ‌నం.